Suryaa.co.in

Andhra Pradesh

టివి9 రజనీకాంత్ గారు.. మేము ఫిర్యాదులు ఇస్తే.. వాయిదాలకి హాజరు కావడానికి నీ జీవితకాలం సరిపోదు

– ట్విట్టర్ లో టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం ఎస్ రాజు

గౌరవనీయులైన టివి9 ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రజనీకాంత్ గారు మా మహాసేన రాజేష్ గారిపై సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చారట! మీ జ్ఞానంతో దిశ పోలీసులకి ఫిర్యాదు చేయలేదు సంతోషం. టిడిపిపైన నువ్వు నీ ఛానల్ చేసిన విషప్రచారంపై మేము ఫిర్యాదులు ఇస్తే.. వాయిదాలకి హాజరు కావడానికి నీ జీవితకాలం సరిపోదు. నీ తప్పులు మేము ఎత్తి చూపడం మొదలుపెడితే ఇన్సులిన్ డోసూ వర్కవుట్ అవ్వదు. నువ్వు మా తెలుగుదేశం జోలికి వచ్చావు. మా లీడర్లు, కేడర్ని కెలుకుతూ ఉన్నావు. మహాసేన రాజేష్ పై కేసులు బనాయించి అరెస్ట్ చేయించాలని చూస్తున్నావు. నువ్వు ప్రజల కోసం పోరాడుతున్న తెలుగుదేశంపైకి వస్తున్నావు. అంటే మీ యజమాని లాగే ప్రజలపై దండయాత్ర చేస్తున్నావు. మేము రెడీ. నీ ఆటో స్పై, పోస్కో అజ్ఞానం..నీ అవినీతిపై మేమూ కేసులు పెడతాం. కాసుకో.

LEAVE A RESPONSE