మంగళగిరి : స్థానిక టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి, ఏపీ ఉమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత, ఏపీ స్టేట్ బిల్డింగ్, అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల రఘురామరాజు, శ్రీశైలం ఆలయ బోర్డు మెంబర్ ఏవీ రమణ, నేతలు పర్చూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన సేవలను కొనియడారు.