Suryaa.co.in

Andhra Pradesh

కులమత బేధంలేని మహనీయుడు వంగవీటి రంగా

– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ: గురువారం అనాసాగరం గ్రామం నందు ఎన్డీఏ కూటమినేతలతో కలిసి స్వర్గీయ వంగవీటి రంగా గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జయంతి వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేద ప్రజల కోసం తన ప్రాణాలు అర్పించిన మహానుభావుడు వంగవీటి రంగా అని నివాళులు అర్పించారు.
ఆ తరానికి దైర్యం, ఈ తరానికి మార్గదర్శం, రేపటి తరానికి ఆదర్శం, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బెజవాడ బెబ్బులి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు అని ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య తెలిపారు.

LEAVE A RESPONSE