రామచంద్రాపురం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ

Spread the love

రామచంద్రాపురం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ రెడ్డి సుబ్రమణ్యం, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి, అమలాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, అమలాపురం పార్లమెంట్ నాయకులు గంటి హరీష్, ప్రత్తిపాడు ఇన్ ఛార్జ్ వరపుల రాజాల ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీయే సరైన పార్టీ అని గుర్తించి పార్టీలో చేరడానికి వచ్చిన వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ పార్టీ జెండాని దించకుండా పనిచేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు నా అభినందనలు. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీకి మంచి నియోజకవర్గం. కొన్ని అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులొచ్చాయి. ఒక్కొక్కసారి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఎన్నికల సమయంలో ఇబ్బందులు పడ్డాం. రెండు సార్లు గెలిపించుకున్నాం. కష్టాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదు. ఒక నాయకుడు పోయినంతమాత్రాన ఏమీ కాదు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుని భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తాం. మాజీ సర్పంచులు, నాయకులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరటం శుభపరిణామం. ఈ సమావేశంలో మాజీ సర్పంచులు రాయుడు లీలాశంకర్, గుడిపుడి గోవిందరాజు, కోట తాతబ్బాయి, పొంపన శ్రీనివాస్, వీరబ్రహ్మం, పెంకె సూర్యనారాయణ, ఆలిపర్ రాంబాబు, పిల్లి సత్యనారాయణలతోపాటు వందమందికి పైగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు కడియాల రాఘవ, పెంకే సాంబశివరావు, చల్లంగి వెదురులయ్య, సలాది సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply