ఏపీ మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబుపై అవాకులు, చవాకులు పేలుతున్నారని… ఉచ్ఛనీచాలు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యత, సంస్కారంతో మాట్లాడాలని హితవు పలికారు.
త్వరలోనే సీఎం జగన్ కు, వైసీపీకి రాష్ట్ర ప్రజలు వీడ్కోలు పలుకుతారని అన్నారు. వైసీపీ చెపుతున్న సామాజిక న్యాయం నేతి బీరకాయలో నెయ్యి వంటిదని ఎద్దేవా చేశారు. మీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రకు ప్రజల నుంచి ఏమాత్రం స్పందన లేదని… మీరు చెపుతున్నట్టు సామాజిక న్యాయం ఉంటే జనాలు ఎందుకు రారని అన్నారు. వైసీపీ పాలనలో సామాజిక న్యాయం లేదు కనుకే… ప్రజలు రావడం లేదని చెప్పారు.