Suryaa.co.in

Andhra Pradesh

మేనమామను అవుతానని చెప్పి, కంసమామలా వారిని వేధిస్తున్నాడు

– దళితులఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు వారికి అరచేతిలో వైకుంఠంచూపిస్తున్నాడు
• చంద్రబాబునాయుడి హయాంలో దళితులకోసం అమలైన సంక్షేమపథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి రద్దుచేశాడు
• దళితులకు తానుమేనమామను అని ప్రకటించుకున్న వ్యక్తి, వారి విషయంలో కంసమామలా ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది
• జగన్మోహన్ రెడ్డి దళితులను వంచించినా, కొట్టినా, తిట్టినా, వారిని వేధిస్తున్నా, వారిని చిన్నచూపు చూస్తున్నాకూడా అధికారపార్టీలోని దళితనేతలు ఆయన్ని ఆహా..ఓహో అని కీర్తిస్తూనే ఉంటారా?..వాస్తవాలు గ్రహించరా?
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామిక ప్రభుత్వం. కాకపోతే దళితులను ఈ విధంగా వేధించడం, అంబేద్కర్ స్మృతివనాన్ని అధోగతిపాలు చేయడం చేస్తారా?
• రాజధాని అమరావతిలో అంబేద్కర్ స్మృతివనం నిర్మించడం ఈప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చేతకాదని, చేయలేరని కుండ బద్ధలుకొట్టి చెబుతున్నా
• ఆర్థికంగా దివాళా తీసిన ఈప్రభుత్వం రాబోయేరోజుల్లో దళితులను ఉద్ధరించడం అనేది ఎప్పటికీ మిథ్యే
_ టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య

అబద్ధపు, అసత్యపుమాటలు, అసాధ్యమైన వాగ్ధానాలతో దళితులకుఅరచేతిలో స్వర్గంచూపి వారిఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక దళి తవర్గాలకు ఏం ఒరగబెట్టాడోచెప్పాలని, ఆయన, ఆయనప్రభుత్వం ఏంచేసిందో చెప్పాలని బ హిరంగ సవాల్ విసురుతున్నానని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

అంబేద్కర్ గారి వారసులైన దళితులను, జగన్మోహన్ రెడ్డి చిన్నచూపుచూస్తున్నాడు. ఆయన అబద్ధపుమాటలునమ్మి, దళితవర్గాలు దారుణంగా మోసపోయాయి. దళితవర్గాల కోసం 2014 నుంచి 2019మధ్యలో చంద్రబాబునాయుడుగారు ప్రవేశపెట్టిన అనేకపథకాలను ఎందుకు తొలగించాడో ఈముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి, ఆయనకు 151సీట్లు ఇచ్చారని ఏంచేసినా చెల్లుతుందన్న ఆలోచనలో ఉన్నారా?

చంద్రబాబు నాయుడి హాయాంలో ఆయన దళితులకు అమలుచేసిన అనేకగొప్పపథకాలను తొలగించిన జగన్మోహన్ రెడ్డి, వాటికంటే మెరుగైనవి, ఉన్నతమైనవి ఏమైనా తీసుకొచ్చాడా? ఏపీప్రభుత్వం దళితులను ఎలా మోసగిస్తుందనేది ప్రజలకు కూడా తెలియాలి.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతప్రభుత్వం, 2లక్షల74వేలమంది దళితయువతకు రూ.3,795 కోట్ల రుణాలిచ్చింది. స్వయంఉపాధి యూనిట్లు మంజూరుచేసి, లక్షలాదిమంది దళిత యువత ఆర్థికంగా స్థిరపడేలాచేసి, సమాజంలో వారిస్థాయిని పెంచింది. తాను చెప్పేవాటికి సమాధానంచెప్పలేక ఈ ప్రభుత్వం పారిపోతుందని కూడా ఈసందర్భంగా స్పష్టంచేస్తున్నా. చంద్రబాబునాయుడు దళితుల కోసం రూ.3,795కోట్లు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో ఎక్కడా రూపాయికూడా ఇవ్వలేదు. ఇచ్చామని, ఫలానావారికి ఆర్థికంగా రుణాలిచ్చి చేయూత అందించామని ముఖ్యమంత్రి చెప్పగలడా?

దళితులకు తానుమేనమామను అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకుంటే తామేమీఅభ్యంతరం చెప్పలేదు. కానీ ఆయన ఎలాంటి మేనమామో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రూపాయిరుణం ఇవ్వకుండా, మాలకార్పొరేషన్, మాదిగ కార్పొ రేషన్, రెల్లికార్పొరేషన్ లను ఏర్పాటుచేసి, ఆయాకార్పొరేషన్లను ఉత్సవవిగ్రహాలుగా మార్చే శాడు. ఛైర్మన్లకు కూర్చోవడానికి కుర్చీలుకూడా లేకుండాచేశాడు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితయువకులకు 1739 ఇన్నోవా కార్లు, 500ట్రాక్టర్లు, 273 ప్యాసింజర్ వాహనాలు, 660 డ్రైనేజ్ క్లీనింగ్ వాహనాలు, 7,500 పవర్ ఆటోలతోపాటు 5వేలట్రక్కులు, 200జేసీబీలు, పౌరసరఫరాలో సరుకులు తరలించడానికి 175వాహనాలు ఇచ్చారు. చంద్రబాబునాయుడి ఉదారతతో ఎన్నిదళితకుటుంబాలు బాగుపడ్డాయో తెలుసా?

దాదాపు 2లక్షల74వేలకుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి. ఈ ముఖ్యమంత్రి వచ్చాక ఒక్క దళిత కుటుంబానికైనా మేలు జరిగిందా? ఇదిగో ఫలానావ్యక్తి కుటుంబానికి తాము ఆర్థికసహయం అందించామని ఈ ముఖ్యమంత్రి చెప్పగలడా? దళితులను దారుణంగా మోసగించిన ఈ ముఖ్యమంత్రిపై దళిత సంఘాలు కోర్టుల్లో కేసులువేయాలి. ఈప్రభుత్వం ఏర్పాటుచేసిన మాల, మాదిగ, రెల్లి కార్పొరే షన్ల ఛైర్మన్లు, జగన్మోహన్ రెడ్డి దళితులకు ఏంచేశాడో బయటకువచ్చి చెప్పగలరా? దళిత వర్గాలు ఎప్పుడూ కార్మికులుగానే ఉండాలన్నది ఈముఖ్యమంత్రి ఆలోచన.

వారెప్పుడూ యజమానులుకావడం, తలెత్తుకుతిరగడం ఈముఖ్యమంత్రికి ఇష్టంలేదుకాబట్టే, వారి విషయంలో మేనమామకు బదులుగా కంసమామలా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి దళితులకు అసలు మేనమామకాదని నేను అంటే, ఆయన దగ్గర ఏంసమాధానం ఉంది? రెండున్నరేళ్ల పాలనలో దళితులకు ఏమీచేయని ముఖ్యమంత్రి, రాబోయేరోజుల్లో చేస్తాడా? అసలు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో ఏమవుతారోకూడా చెప్పలేము. ముఖ్యమంత్రి కేసులు ఏమవుతాయో, రాష్ట్రఆర్థికపరిస్థితి ఏమవుతుందో అంతుచిక్కడం లే దు. చంద్రబాబునాయుడు ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రరాజధాని అయిన అమరా వతి నడిబొడ్డున 20ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణానికి రూపకల్పన చేశారు. దానిలో 120 అడుగులఅంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి సర్వంసిద్ధం చేశారు.

2017 ఏప్రియల్ 14న, అంబేద్కర్ మహనీయుడి పుట్టినరోజున రూ.100కోట్లు నిధులిచ్చి స్మృతివనం నిర్మాణానికి అంకురార్పణచేశారు. సదరుస్మృతివనం ప్రాజెక్ట్ లో 30శాతంవరకు పనులు టీడీపీప్రభుత్వంలోనే జరిగితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని భూస్థాపితంచేశాడు. చంద్రబాబునాయుడిగారిపై కక్షతో, అమరావతిలో నిర్మాణంలోఉన్న అంబేద్కర్ స్మృతివనాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనంచేశాడు. 30శాతం పనులైన ప్రాజెక్ట్ ను పాతాళానికి తొక్కేసి, దానికి బదులుగా కోర్టువివాదాల్లో ఉన్న విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 2022 ఏప్రియల్ 14నాటికి అంబేద్కర్ విగ్రహనిర్మాణం పూర్తిచేస్తామని ఈ ముఖ్యమంత్రి ప్రగల్భాలు పలికాడు.

దానినిర్మాణానికి సంబంధించి ఇంతవరకు ఇటుకకూడా పెట్టలేదు. ఈ ప్రభుత్వం అభివృద్ధిపథంలో నడవడంలేదు. అప్రజాస్వామికంగా నడుస్తోంది. స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం ఈప్రభుత్వం వల్లకాదు. దాన్నిఈ ముఖ్యమంత్రి పూర్తచేయలేడు. దాని నిర్మాణానికి సంబంధించి రూపాయినిధులివ్వకుండా, ఇటుకకూడా పెట్టకుండా వచ్చే ఏప్రియల్ 14నాటికి ఎలాపూర్తిచేస్తారు? దాన్నిపూర్తిచేస్తామని చెప్పగల ధైర్యంఈ ప్రభుత్వానికిఉందా? ఆఖరికి చంద్రబాబునాయుడి హాయాంలో అంబేద్కర్ స్మృతివనంనిర్మాణానికి కేటాయించిన రూ.100కోట్లను కూడా ఈముఖ్యమంత్రి దారిమళ్లించాడు.

ఇప్పుడేమో తీరిగ్గా వట్టిఖజానా పట్టుకొని ఈ ముఖ్యమంత్రి ప్రజలను మభ్యపెడుతున్నాడు. చంద్రబాబునాయుడు దళితబిడ్డ లకోసం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లను, విదేశీవిద్యపథకాన్ని జగన్మోహన్ రెడ్డి అటకెక్కిచింది నిజంకాదా? మేనమామను అనిచెప్పుకునేవ్యక్తి,దళితబిడ్డలకు ఉన్నతవిద్యను ఎందుకు దూరంచేశాడు? అంబేద్కర్ విదేశీ విద్యపథకం కింద దళితబిడ్డలు విదేశాలకు వెళ్లి చదువుకుంటే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బందేమిటి? ? చంద్రబాబునాయుడి గారిహాయాంలో 440మంది దళితవిద్యార్థులు విదేశాలకువెళ్లి చదువుకొని, వారికాళ్లపై వారునిలబడ్డారు. ఈ ముఖ్యమంత్రి వచ్చాక ఎందరు దళితవిద్యార్థులు విదేశాలకు వెళ్లారో చెప్పగలడా?

అంబేద్కర్ వారసులైన దళితబిడ్డలు విదేశాలకు వెళ్లి, చదువుకోవడం ఈముఖ్యమంత్రికి ఇష్టంలేకనే విదేశీవిద్యపథకాన్ని రద్దుచేవారా? దళితయువకులు విదేశాలకు వెళ్లిచదువుకొని వారికాళ్లపై వారు నిలబడితే ఈముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బందేమిటి? దళితులు అగ్రకులాలతో వియ్యం అందుకోవడాన్నిజీర్ణించుకోలేకనే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు అమలుచేసిన కులాంతర వివాహప్రోత్సాహాకం పథకాన్ని, దానికింద ఇచ్చేరూ.లక్ష సొమ్ముని రద్దుచేశారా?

కులాలమధ్య ఉండే అంతరాలను తగ్గించడానికి చంద్రబాబునాయుడు ఎంతో దూరదృష్టి తో తీసుకొచ్చిన పథకం అది. కులవ్యవస్థ తగ్గిపోయి, సమాజాభివృద్ధికోసం తీసుకొచ్చిన పథకంఅది. అలాంటిపథకాన్ని తీసేశాడంటే, ఈముఖ్యమంత్రికి దళితులపై ఎంతద్వేషముందో అర్థమవుతోంది. టీడీపీప్రభుత్వం దళితయువతకోసం తీసుకొచ్చిన ఏపీస్టడీ సర్కిళ్లు, అంబేద్కర్ స్టడీ సర్కిళ్లు, బుక్ బ్యాంక్ పథకాలన్నీ ఈ ముఖ్యమంత్రి రద్దుచేశాడు. చంద్రబాబునాయుడు రూ.135కోట్లతో 3వేలఎకరాలుకొని, ఆభూమిని దళితమహిళలపేరుతో రిజిస్ట్రేషన్లు చేయించారు.

భూమి ఉంటే వారుఆర్థికంగా నిలబడతారన్న దూరదృష్టితో ఆయన ఆపనిచేస్తే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇళ్లస్థలాల పేరుతో 11వేలఎకరాల దళితుల స్వాధీనంలోని అసైన్డ్ భూమిని అప్పన్నంగా లాక్కున్నది నిజంకాదా? అలాంటి ముఖ్యమంత్రి దళితులకు మేనమామ అవుతాడా? రూ.4వేలకోట్ల ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఈ ముఖ్యమంత్రి దారిమళ్లించింది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి దళితులను వంచించినా, కొట్టినా, తిట్టినా, వారిని వేధిస్తున్నా, వారిని చిన్నచూపు చూస్తున్నాకూడా అధికారపార్టీలోని దళితనేతలు ఆయన్ని ఆహా..ఓహో అని కీర్తిస్తూనే ఉంటారా? .. వాస్తవాలు గ్రహించరా?

దళితుల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఈ ఈ ముఖ్యమంత్రికి ఇసుమంతైనా చిత్తశుద్ధి ఉన్నదా..ఉందని దళితులను నమ్మించే ప్రయత్నాలు చేయకండి. అలాచేస్తే వారు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించరు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముమ్మాటికీ అప్రజాస్వామిక ప్రభుత్వం. కాకపోతే దళితులను ఈ విధంగా వేధించడం, అంబేద్కర్ స్మృతివనాన్ని అధోగతిపాలు చేయడం చేస్తారా? జాతీయఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి రావాల్సిన న్యాయాన్నికూడా ఈప్రభుత్వం అడ్డుకుంటోంది. ఆర్థికంగా దివాళా తీసిన ఈప్రభుత్వం దళితులను ఉద్ధరించడం అనేది ఎప్పటికీ మిథ్యే.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండున్నరేళ్లఆయనపాలనలో దళితులకు ఒరిగింది శూన్యం, తనపాలనలో వారికి దాడులు, వేధింపులు, అవమానాలు, హత్యలను మిగిల్చిన జగన్మోహన్ రెడ్డి వారికి మేనమామ అవుతాడా? కంసమామ అవుతాడా? జగన్మోహన్ రెడ్డి, ఆయనప్రభుత్వం దళిత వర్గాలను ఏవిధంగా మోసగించిందో, రాజ్యాంగపరంగా దళితులకు రావాల్సిన హక్కులను ఏరకంగా కాలరాసిందో, వారి ఆర్థిక హక్కుని ఎలా చిదిమేసిందో వివరిస్తూ, దళితులకు దక్కాల్సిన న్యాయంకోసం న్యాయస్థానాలను ఆశ్రయించబోతున్నాం.

ఏతావాతా జగన్మోహన్ రెడ్డిదళితులకు అరచేతిలో వైకుంఠంచూపిస్తూ, వారు ఎప్పటికీ కార్మికులుగానే ఉండాలని భావిస్తున్నారు. దళితులకు మూడుకార్పొరేషన్లుపెట్టి, అంతిమంగా వారిని ఒకమూలన కూర్చొబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానిదే.

LEAVE A RESPONSE