Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల భార్గవ్ రెడ్డిపై వర్ల రామయ్య ఫిర్యాదు

– రామాల మన్విత్ కృష్ణారెడ్డి అనే వైకాపా కార్యకర్తకు తెలుగుదేశం నాయకుడిగా వేషం కట్టి సోషల్ మీడియా మాద్యమాల్లోకి సజ్జల భార్గవ్ రెడ్డి వదిలాడు
– సిగ్గులేని దుర్మార్గపు పనులు చేస్తున్న వైకాపా నాయకుల కుట్రలను ప్రజలు గమనించాలి
– పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా దళితులను తిట్టటం, IT ఉద్యోగస్తులను నిందించటం మరియు తెలుగుదేశం పార్టీపై వ్యతిరేకత వచ్చేటట్లుగా వీడియోలు చేస్తున్న వైకాపా కార్యకర్త మన్విత్ కృష్ణారెడ్డి, అతనికి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వేషం వేయించిన సజ్జల భార్గవ్ రెడ్డిపై సోమవారం సీఐడీ ప్రధాన కార్యలయంలో ఎస్పీ రత్న కు పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మర్యదపూర్వకంగా కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ… అధికారం చేజారిపోతొందని జగన్‌మోహన్ రెడ్డికి అర్థమైంది. ఎలా అయినా, ఎన్ని కుట్రలు, కుయుక్తులు, అరాచకాలు, దౌర్జన్యాలు చేసైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని కుట్రపూరిత ఆలోచనలతో జగన్ రెడ్డి ఉన్నారు. అందుకోసం నానా గడ్డి తినేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకుండా ఉండేందుకు.. ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు. అందులో భాగంగానే రామాల మన్విత్ కృష్ణారెడ్డి అనే కరుడుగట్టిన వైకాపా కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా వేషం కట్టి సోషల్ మీడియా మాద్యమాల్లోకి సజ్జల భార్గవ్ రెడ్డి వదిలాడు.

తల్లిదండ్రులు పేరు చేప్పుకొనే ధైర్యం కూడా లేని మన్విత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చూపిస్తూ ఎస్సీ ఎస్టీ కులాల వారిని తిట్టడం, జగన్ రెడ్డి పాలనను పొగుడే వీడియోలను చేయిస్తున్నాడు సజ్జల భార్గవ్ రెడ్డి. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వీడియోలను తయారు చేయిస్తున్నాడు. ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీని బద్నాం చేయాలని వైకాపా నాయకులు ఇటువంటి కుట్రలు పన్నుతున్నారు. సంబంధిత విడియో క్లిప్పింగ్స్‌ను తీసుకొని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి సీఐడీ చీఫ్ సంజయ్‌ అందుబాటులో లేకపోవటంతో, CID SP రత్న వారిని కలిసి ఫిర్యాదు చేసి సంబంధిత వీడియోలను చూపించాము.

వాటిని చూసిన ఎస్పీ ఆశ్చర్యపడి, మన్విత్ రెడ్డి ఎక్కడ దాక్కున్నా పట్టుకొని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఐడీ చీఫ్ సంజయ్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇటుంవంటి కుట్రలు చేస్తున్న మన్విత్ రెడ్డిని, చేయిస్తున్న సజ్జల భార్గవ్ రెడ్డిని ఈ నెలాఖరులోపు అరెస్ట్ చేసి శిక్షించటమే కాకుండా వీరి వెనకున్న జగన్‌మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి పాత్ర వెలుగుతీయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనియెడల సాక్ష్యాధారాలతో సహా హైకోర్టుని ఆశ్రయిస్తాం.

అంతేకాకుండా గతంలో సోషల్ మీడియా కేసుల్లో తెలుగుదేశం పార్టీ వారి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్‌లు, లాప్ టాప్‌లు, ఐపాడ్‌లు తదితర పరికరాలన్నీ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం వెంటనే వాటిని తిరిగివ్వాలని ప్రత్యేకంగా ఫిర్యాదు చేశామని ఆయన తెలియజేశారు.

LEAVE A RESPONSE