విశ్వకర్మ యోజన గొప్ప పథకం: బీజేపీ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్

-కుల వృత్తుల ను ప్రోత్సహించడమే మోడీ గారి లక్ష్యం: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జేనవాడే సంగప్ప
-నారాయణఖేడ్ లో విశ్వకర్మ యోజన అవగాహన సదస్సుకు భారీ స్పందన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకం పేద యువకుల్లో స్వయం ఉపాధిని పెంచుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప అన్నారు. విశ్వకర్మ యోజన వల్ల కుల వృత్తుల పై ఎంతో గౌరవం పెరుగుతుందని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ అన్నారు. నారాయణఖేడ్లో విశ్వకర్మ యోజన అవగాహన సదస్సులో పాల్గొని నాయకులు ఈ పథకం గొప్పతనాన్ని వివరించారు.

ఖేడ్ లో సంగప్ప అధ్యక్షతన జరిగిన విశ్వకర్మ యోజన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆలే భాస్కర్ ఈ పథకాన్ని ఉత్సాహ వంతులైన యువతీ యువకులు ఉపయోగించుకోవాలని సూచించారు. . ప్రతి గ్రామంలో యువతీ యువకులు ఈ పథకం ద్వారా రుణాన్ని పొంది తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఎంతో ఉపయోగపడుతుందని భాస్కర్ అన్నారు.

యువకుల్లో స్వయం ఉపాధి మాత్రమే కాకుండా మరికొంతమందికి ఉపాధి కల్పించే విధంగా యువతను ఈ విశ్వకర్మ యోజన ప్రోత్సహిస్తుందని సంగప్ప వివరించారు. 18 రకాల చేతి వృత్తులకు ఈ విశ్వకర్మ యోజన రుణం అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సదస్సులో ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్, సంజయ్, శ్రీనివాస్, సాయిరాం తోపాటు భారీ సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

Leave a Reply