పోలీసు శాఖకు చెందిన స్థలం వైసీపీ కార్యాలయ నిర్మాణానికా?

– టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రాష్ట్రంలో ప్రజల ధన, మాన ప్రాణాలు, శాంతిభద్రతలను సజావుగా కాపాడటంకోసం పోలీసుశాఖ ఉంది.
వాటిని కాపాడటమే పోలీసు వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ప్రజల మాన, ప్రాణాలు కాపాడుకోవటానికి ఉన్న వ్యవస్థనుజగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పోలీసు శాఖ తమ ఆస్తులనే కాపాడుకోలేని దుస్థితిలో ఉంది. ఇక ప్రజల ఆస్తులను ఎలా కాపాడుతారు? ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వారు వైసీపీకి అడుగులకు మడుగులొత్తుతున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి గ్రామం ఒక చారిత్రాత్మక గ్రామం. చంద్రగిరి పట్టణానికి ఒక చారిత్రాత్మక చరిత్ర ఉంది. అది పురాతనమైన గ్రామం. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అక్కడ ఒక పెద్ద కోట కట్టారు. ఇదొక యాత్రా స్థలం. చంద్రగిరి పట్టణాన్ని టూరిజం శాఖ అభివృద్ధి చేస్తోంది.

అక్కడ బ్రిటీష్ కాలం నుండి 1 ఎకరా 33 స్థలం పోలీసు శాఖ కంట్రోల్ లో ఉంది. అక్కడ పోలీస్ క్వార్టర్స్, జిమ్, ఆశాఖకు సంబంధించిన నిర్మాణాలు కట్టాలనే ఉద్దేశంతో అక్కడ బ్రిటీష్ ప్రభుత్వం స్థలం కేటాయించారు. 1 ఎకరా 33 సెంట్ల ఈ స్థలం పోలీసులకు చెందినదని అడంగల్ లో క్లియర్ గా ఉంది. పోలీసువారి స్థలానికే రక్షణ లేకపోతే ఎలా? ఆ స్థలంలో ఈ స్థలం పోలీసు శాఖకు చెందినదని బోర్డు కూడా2 పెట్టారు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికేమెక్కగలదు? అనే సామెతలా వారి ఆస్తిని వారు కాపాడుకోలేనివారు ప్రజల ఆస్తులను ఏం కాపాడగలరు? వారి ఆస్తులను కాపాడుకోవడంలో పోలీసు శాఖ ఘోరాతిఘోరంగా విఫలమైంది. పోలీసు స్థలాన్ని వారే వైసీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వటం జరిగింది. పోలీసు పెరేడ్ గ్రౌండ్, పోలీసు స్టేషన్, పోలీసు జిమ్, పోలీసు కల్యాణ మండపం లాంటివి కట్టుకోవడానికి ఇచ్చినా అర్థముందిగానీ పోలీసులకు చెందిన స్థలాన్ని ఒక పార్టీ కార్యాలయ నిర్మాణాకి ఇవ్వడంలో అర్థంలేదు.

చంద్రగిరి ఎమ్మెల్యే ఎవరికీ తెలియకుండా ఆ స్థలంలో భూమిపూజ చేయడమేంటి? ఆ స్థలం ఆయనది కాదు కదా.. ఆయన ఎలా పూజ చేస్తారు? ఈ కబ్జాకి పోలీసు శాఖ ఎలా సహకరిస్తుంది? స్థానిక ఎమ్మెల్యే అక్కడ దొంగతనంగా ఒక్కడే వెళ్లి భూమిపూజ చేసినట్లు ఆధారాలున్నాయి. ఈ భూమిపూజ శాస్ర్త్రోక్తంగా1 జరగలేదు. శాస్త్ర విరుద్ధంగా జరిగిందనడానికి సాక్ష్యం అక్కడ సింగిల్ కొబ్బరికాయ ఉండటమే. దీంతో వైసీపీ దొంగతనం, డొల్లతనం బయటపడుతున్నాయి. రహస్య జీవోను సీక్రెట్ లో పెట్టారు. గతంలో తుడా వారు ఇక్కడ పార్కు కట్టుకుంటామని పోలీసు శాఖను అడిగితే కుదరదని తుడావారికి ఎస్పీ లెటర్ రాశారు. అలాంటి స్థలాన్ని ఇప్పుడు వైసీపీకి అప్పణంగా అప్పజెప్పారు. ఈ దొంగ పనులెందుకు? దొంగజీవో, బ్లాక్ జీవో, డార్క్ జీవోను సృష్టించారు. భవిష్యత్తులో గుంటూరులోని పెరేడ్ గ్రౌండ్ ను కూడా ఇచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గుంటూరు, విజయవాడ పెరేడ్ గ్రౌండ్లు వైసీపీ పార్టీ ఆఫీసుకో, వైసీపీ నాయకులు జూదగృహం, క్యాసినో నిర్వహించుకోవడానికో ఇచ్చేసినా ఆశ్చర్యలేదు. ఇలాంటి పనులు చేసినందుకు పోలీసు శాఖ సిగ్గుతో తలదించుకోవాలి. నిర్లజ్జగా, నిస్సుగ్గుగా చీకటి జీవో విడుదల చేసి వైసీపీకి ఇస్తారా? ఇది దొంగల పరిపాలనో, దొరల పాలనో అర్థంకావడంలేదు.

పోలీసు స్థలాన్నే కొట్టేసిన వైసీపీకి మిగతా స్థలాలు కొట్టేయడం ఒక లేక్కా? ఈ వివరాలతో నేను డీజీపీకి ఒక లేఖ రాశాను. దానికి స్పందన లేదు. తిరుపతికి చెందిన ఒక రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ క్రిష్ణయ్య ఎంతో ఆవేదన, బాధతో ఈ స్థలాన్ని కాపాడండని డీజీపీకి, ఎస్పీకి మొత్తుకున్నా ఫలితంలేదు. ఎకరా భూమి 30 కోట్లు చేసే భూమిని ఈజీగా వైసీపీవారు కొట్టేశారు. నా లేఖకే స్పందన లేదు. ఇదొక ప్రభుత్వమా? అని ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం దొంగగా విడుదల చేసిన జీవోను వెనక్కి తీసుకోవాలి. అందరూ కలిసి గూడుపుఠాణి చేస్తున్నారు. 64 కోట్ల రూపాయల ప్రాపర్టీని వదలుకోకండి, డీజీపీ, వారి టీం ఇప్పటికైనా మేల్కొని, ఏం జరుగుతోందో చూడాలి. మంచి కార్యాలకు ఇవ్వాల్సిన స్థలం రాజకీయ కార్యాలయాలకా? పోలీసు శాఖ మేల్కొని ఉంది అని గుండెలమీద చేయివేసుకొని చెప్పలరా? ప్రొసిజెర్ ప్రకారమే పోలీసుశాఖకు సంబంధించిన స్థలాన్ని అధికార పార్టీ నిర్మాణానికి ఇచ్చామని గుండెలపై చేయివేసుకొని చెప్పాలి.

రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పోలీసు వ్యవస్థ పక్కున నవ్వే పని చేశారు. ఎస్పీ కౌశిల్ బాగానే హ్యాండిల్ చేసినా డీఐజీ వ్యవహారం సరికాదు. ఇసుక అక్రమ తవ్వకం జరుగుతోందని ఆపడానికి వెళ్లిన పోలీసుకు వైసీపీ తాలూకు మనుషులు తల పగులగొట్టారు. కేంద్ర కార్యాలయం జోక్యం చేసుకుంటే తప్ప హత్యాయత్నం కేసు నమోదు చేయలేదు. డీఐజీ గారు కానిస్టేబుల్ తరపున మాట్లాడకుండా వైసీపీ తరపున మాట్లాడుతారా? మంచి చేస్తే మంచి అనే చెప్పే నైజం మాది. స్థానిక ఎమ్మెల్యే నిందితుడిని కాపాడుతూ వస్తున్నాడు. ఆత్మకూరు నుంచి బయటికి వెళ్లిపోయిన మాదిగ కులస్థులు ఇంతవరకు వారి సొంత గ్రామానికి చేరలేదు. భయపడి ఊరొదలి వెళ్లిపోతే లా అండ్ ఆర్డర్ బాగున్నట్లా? ఒక చిన్న పోస్టింగ్ పెడితే టీడీపీ నాయకులను వేధిస్తారు. మాటిమాటికి పోలీసు స్టేషన్ కు పిలవడం ఎంతవరకు సమంజసం? వైసీపీ ఎంత ఘోరాతి ఘోరంగా పోస్టింగులు పెట్టినా నో యాక్షన్. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే. అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడినవారిని వదిలేది లేదని, ఇంతటితో ఇది ముగిసిపోలేదని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య హెచ్చరించారు.

Leave a Reply