పంటల బీమాపై సీఎం మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది

-రబీ పంటల భీమా ఎందుకు ఎత్తేసారు ?
-టీడీపీ పశ్చిమ రాయలసీమ శాసనమండలి గ్రాడ్యుయేట్ mlc అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి

గతంలో ఎప్పుడూ లేని విధంగా పంటలబీమా పరిహారాన్ని ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది .రబీ సీజన్లో విత్తే పంటలకు భీమా పథకాన్నే ఎత్తివేసి రైతుల నోట్లో మట్టికొట్టిన ముఖ్యమంత్రి, తనలాంటి రైతు ప్రేమికుడు దేశంలోనే ఎవరూ లేరని చెప్పుకోవడం సిగ్గుచేటు .భీమా పధకం అమల్లోకి వచ్చినప్పటినుంచి రబీ పంటలకు భీమా సౌకర్యం కల్పించేవారు .బుడ్డశెనగ ,ప్రొద్దుతిరుగుడు ,వేరుశెనగ ,ఉల్లి పంటలకు భీమా ఉండేది .జగన్ సీఎం అయ్యాక ఎప్పుడు కూడా రబీ భీమా ఇవ్వలేదు .అలాంటి రైతు వ్యతిరేఖి తనలాంటి వారెవరూ లేరని గొప్పలు చెప్పుకోవడం ప్రజలకే తలఒంపులు .ఏ ప్రభుత్వ హయాంలో పంటల భీమా పధకం బాగుందో పులివెందుల ప్రజలనడిగితే చెబుతారు ..ఈ కర్షక విధానంపెట్టి రైతులను నాశనం చేసారు .రైతులకు మేలు చేయాలని ఏమాత్రం సీఎం కు చిత్తశుద్ధి వున్నా గతంలో వున్న ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పధకాన్ని ప్రవేశ పెట్టాలి .అలాగే రబీ పంటలకు కూడా భీమా అమలుచేయాలి .మూడేళ్లవుతున్నా రైతులకు బిందు సేద్య పరికరాలను ఎందుకు ఇవ్వలేదో సీఎం సమాధానం చెప్పాలి .జీవో ఇచ్చి ఏడాదవుతున్నా ఒక ఇంచి పైపు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి రైతుబాంధవుడా ?వచ్చే ఎన్నికల్లో జగన్ కు రైతులే తగిన బుద్ది చెబుతారు .

Leave a Reply