Suryaa.co.in

Features Political News

వేలు నీదే.. కన్ను నీదే

( పి.చైత్రకుమార్)

నేడు నువ్వు వేలు పాత్రలో కన్నుని పొడవవచ్చు రేపు అనే రోజు ఖచ్చితంగా..ఖచ్చితంగా.. నువ్వు కన్ను పాత్రను పోషించక తప్పదని గుర్తుంచుకో..
వ్యవస్థ ఏదైనా కొనసాగుతున్న విధానం ఇదే..
ఒక్క నిమిషం.. ఒక్క నిమిషం.. విజ్ఞతతో ఆలోచించు..

మన అందరికీ తెలిసిన కథే మళ్లీ నెమరు వేసుకుంటున్నం అంతే..
అడవిలో ఎన్నికల వచ్చాయంట గల గల పారే సెలయేరు ఎన్నికల బరిలో నిలిచింది. సెలయేరుకి ప్రత్యర్థిగా గొడ్డలి సిద్ధమైంది. అడవిలోని జంతువులు పశుపక్షాదులు నీరే ప్రాణమైన చెట్లు సెలయేరుకి మద్దతుగా నిలిచాయి. కానీ ఎన్నికల్లో అనూహ్యంగా గొడ్డలి విజయం సాధించింది.. ఎన్నికలపై ఆత్మపరిశీలన చేయగా గొడ్డలికి క్రింద పక్కన ఉండే కట్టె చెట్టు జాతికి సంబంధించిందని పక్షపాతంతో చెట్లన్నీ గొడ్డలికి ఓటేసి గెలిపించాయి.

కానీ గెలిచిన మరుసటి రోజు నుండి గొడ్డలి తన సహజ నైజాన్ని ప్రదర్శించింది. గొడ్డలి తన వృత్తి ధర్మంగా చెట్లను నరకడం ప్రారంభించింది. చెట్లన్నీ ప్రాధేయపడం మొదలుపెట్టాయి. ఏమిటీ అన్యాయం నిన్ను కష్టపడి గెలిపించుకుంది మమ్మల్ని నరకడానికా అని ప్రశ్నించాయి.

గొడ్డలి చిరునవ్వు నవ్వి మీరు న్యాయం గురించి మాట్లాడుతున్నారా.. మీకు జీవనాధారమైన సెలయేరుకు వెన్నుపోటు పొడిచారు. నన్ను ఏం చేయమంటారు. నా సహజగుణం చెట్లను నరకడం కట్టెగా నేను మీ జాతిదని నన్ను గెలిపించారు. నా సహజ గుణాన్ని నేను మార్చుకోలేను కదా..?

అయినా నాదొక ధర్మసందేహం మిత్రులారా.. సెలయేరు సహజగుణం చెట్లను జంతువులను పశుపక్ష్యాదులను బతికించడం కానీ గొడ్డలిగా నా సహజగుణం నరకడం అన్నీ తెలిసిన మీరే నన్ను గెలిపించి ఈరోజు ప్రశ్నిస్తే ఎలా?

LEAVE A RESPONSE