-జగన్ రెడ్డి అండదండలతోనే ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి న్యాయవ్యవస్థపై విమర్శలు
– ప్రభుత్వం వెంకటరామిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేస్తాం
– పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు
ఉద్యోగ సంఘ నాయకులు వెంకటరామిరెడ్డి ప్రజాస్వామానికే అతి పెద్ద ప్రమాదకరం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తి ఉద్యోగ నాయకుడా? సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డి వ్యవహరిస్తూ న్యాయ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. న్యాయ వ్యవస్థపై ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్లేలా మాట్లాడటం రాజ్యాంగాన్ని దిక్కరించడమే అవుతుంది. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ, పరిపాలన వ్యవస్థలు లాంటి రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా, సమన్వయంతో పని చేస్తాయని సంగతి వెంకట్రామిరెడ్డికి తెలియవా?
వెంకటరామిరెడ్డి ఉద్యోగ సంఘ నాయకుడులా కాకుండా ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తలా మాట్లాడుతున్నారు. అదే విధంగా ఉద్యోగుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వెంకటరామిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఇతర ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడితే వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? పరిస్థితి ఇలానే కొనసాగితే రాష్ట్రంలో లాలెస్ నెస్ కు దారి తీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడకపోగా స్వప్రయోజనాల కోసం వెంకటరామిరెడ్డి ప్రాకులాడుతున్నారు. న్యాయవ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు చేసిన వెంకటరామిరెడ్డిపై చీఫ్ సెక్రటరీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. లేనట్లైతే దీనిపై ప్రైవేట్ కేసులు వేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం.