మనం అక్కడే ఎందుకు ఆగిపోయాం?

(శీలం శేషు రెడ్డి )

అవును!
మనం అక్కడే ఆగిపోయాం!!⋯
కమ్మా! కమ్మా! కమ్మోడు!
అని కుల దూషణ దగ్గరనే ఆగిపోయాం.

అంతరిక్షం లోకి ఆడపిల్ల వెళ్తే..
మహిళ సాధికారత అనే విషయం మర్చిపోయి,
అందునా తెలుగు ఆడబిడ్డ అని మర్చిపోయి కమ్మ అనేశాం.
తను భవిష్యత్తులో ఇంకా ఎత్తులో ఉన్న జాబిలిని ముద్దాడుతుంది…
కాని మనం అక్కడే ఆగిపోయాం.

9నెలల నిండు చూలాలు చెస్ లో కాంస్య పతకం సాధిస్తే కనీసం విష్ చేయలేకపోయాం..
కాని కమ్మ అనేస్తాం.తను మాత్రం తర్వాత ఆడే గేమ్ గురించి ఆలోచిస్తుంది.మనం మాత్రం అక్కడే ఆగిపోయాం.

రాజధానికి భూములిస్తే..రాష్ట్రానికి రాజధాని,అభివృద్ధి అని మర్చిపోయాం.
కమ్మ అనేశాం.. వాళ్ళు మాత్రం పోరాడారు.నడిచారు,దెబ్బలు తిన్నారు,సాధించారు.
మనం మాత్రం అక్కడే ఆగిపోయాం.

వాళ్ళు వ్యాక్సిన్ కనిపెట్టి ప్రజల ఆరోగ్య,ఆయుస్సు ప్రధాతలై ప్రజల జీవితాలలో వెలుగునింపుతుంటే వీళ్ళకి కూడ కులం ఆపాదించి
కమ్మ అనేశాం..వాళ్ళు మాత్రం పరిశోధనలో కొత్తపుంతలు తొక్కుతుంటే..
మనం మాత్రం అక్కడే ఆగిపోయాం.

ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.
వాళ్ళు
వ్యాపారస్తులుగా,
డాక్టర్లుగా,
విద్యావేతగా,
రైతుగా,
ఇంజనీర్ గా,
శాస్త్రవేతగా,
వివిధ రంగాలలో
పది మందికి ఉపాధి కల్పిస్తుంటే
మనం మాత్రం అక్కడే ఆగిపోయాం..
కమ్మ అనే పదం దగ్గరే..