Suryaa.co.in

Andhra Pradesh

మేం ఏ కూటమిలో లేం..మాది ప్రజల కూటమి

– ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ
– ప్రత్యేక హోదా, పోలవరంతోపాటు విభజన హామీలు నెరవెర్చేలా పార్లమెంటులో ఒత్తిడి తెస్తాం
– రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టాలా పార్లమెంటులో ప్రతిక్షణం ప్రజా ప్రయోజనాల కోసం పోరాడతాం
– రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీ చేయాలి, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు కేంద్రమే ఇప్పించాలి
– విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం
– హుద్ హుద్ సమయంలో చంద్రబాబు డ్రామాలతో ప్రజలకు ఒరిగిందేమీలేదు
1- రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు పార్లమెంటు సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు గడిచింది. మరో రెండున్నరేళ్ళ తర్వాత ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. మాకంటూ పార్లమెంటులో సొంత బలం ఉంది. మేము ఏ కూటమిలో లేము. అటు ఎన్డీఏలోగానీ, ఇటు యూపీఏలోగానీ లేము. మాది ప్రజల కూటమి, ప్రజల మనుషులం, మాది ప్రజల పార్టీ. కాబట్టి, పార్లమెంటులో పార్టీ లేవనెత్తే ప్రతి అంశం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే, ఇందులో రాజీపడే పరిస్థితే లేదు.
2- రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఆచితూచి అడుగు వేయండని ముఖ్యమంత్రిగారు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మేలు చేసే ప్రతి అంశం పార్లమెంటులో లేవనెత్తుతాం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా భావించి ప్రజా సమస్యలను పార్లమెంటులో లేవనెత్తి, తద్వారా కేంద్రం దృష్టికి తీసుకువెళతాం. రాష్ట్రం కోసం సమిష్టిగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రిగారు తెలియజేశారు.
3- పార్లమెంటులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం మొత్తం 28 ఎంపీలు(లోక్ సభలో- 22 ప్లస్ రాజ్యసభలో- 6) , రాబోయే రోజుల్లో రాజ్యసభలో మా పార్టీ సభ్యుల సంఖ్యా బలం 11కు చేరుకుంటుంది. ఉభయ సభల్లో రాష్ట్ర ప్రతిష్టను నిలబెట్టాలా, ప్రజల కోసం ప్రతి క్షణం పాటుపడాలని, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని నిర్ణయించాం.
4- పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై పార్లమెంటులో పోరాడతాం. సవరించిన ప్రాజెక్టు అంచనాల ప్రకారం రూ. 55, 657 కోట్ల బడ్జెట్ ఆమోదానికి కృషి చేయాలని సీఎం గారు ఆదేశించారు. జాతీయ ప్రాజెక్టు అంటే, విద్యుత్, సాగునీరు, తాగు నీరు.. అన్నీ కలయికకు సంబంధించినది. కానీ, కేంద్ర ప్రభుత్వం తాగునీరు, సాగునీరు సపరేట్ గా చేయడం కరెక్టు కాదు. కాంపొనెంట్ వైజ్ గా విడదీయడం, పోలవరం ప్రాజెక్టు డిజైన్లు ఇంకా ఆమోదించకపోవడంపై పోరాడాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టుపై ఖర్చు చేసిన రూ. 2,104 కోట్లను కేంద్రం నుంచి రాబట్టాలని తెలిపారు.
5- ఇటీవల తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ముఖ్యమంత్రిగారు ప్రధానంగా 6 అంశాలను లేవనెత్తారు. వాటిని సాధించేందుకు పార్లమెంటులో ఎంపీలంతా పోరాడాలని సూచించారు.
6- జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో కేంద్రం హేతుబద్ధత పాటించలేదు. రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చి, ఆ చట్టం కింద లబ్ధిదారులను తక్కువ చేసి, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారు. దాన్ని వెంటనే సవరించాలి. అలానే, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కు కేంద్రం నుంచి రావాల్సిన రూ. 1708 కోట్లు బకాయిలు రాబట్టాలని పార్లమెంటులో ఒత్తిడి తెస్తాం. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిల చెల్లింపు అంశం అపరిష్కృతంగా ఉంది. తెలంగాణలో విద్యుత్‌ పంపిణీకి సంబంధించి ఆ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థకు రూ.6,112 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. దీనిపైన కూడా కేంద్రంపై ఒత్తిడి చేస్తాం, నిజానికి కేంద్రం అనుమతితోనే తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేశాం. ఆ నిధులు ఇప్పించాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే అని మేం మరోసారి పార్లమెంటు సమావేశాల్లో నొక్కి వక్కాణిస్తాం.
7- మరోవైపు, 2014–15కు సంబంధించి కాగ్‌ నివేదిక ప్రకారం.. రాష్ట్ర రెవెన్యూ లోటు (రీసోర్స్‌ గ్యాప్‌) ఏకంగా రూ.22,948.76 కోట్లకు చేరుకుంది. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ అంశం 2014 నుంచీ కేంద్రం, రాష్ట్రం మధ్య నలుగుతూ ఉంది. కేంద్రం ఇప్పటివరకు ఇచ్చింది కేవలం రూ. 4,117 కోట్లు మాత్రమే. దీనిలో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందనడంలో సందేహం లేదు.
8- చంద్రబాబు హయాంలో వారి ఐదేళ్ల పాలనలో అధిక మొత్తంలో రుణాలు సేకరించిందని(ఓవర్ బారోయింగ్), ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటిపోయారని.. ఊహించని విధంగా కేంద్ర ఆర్థిక శాఖ బారోయింగ్ కెపాసిటీని తగ్గించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఈ అంశాన్ని చంద్రబాబు హయాంలోనే, అంటే 2018-19లో కేంద్రం ఎందుకు ప్రశ్నించలేదు. అంచెలంచెలుగా ఎందుకు తగ్గిస్తున్నారు. ఏపీపై కేంద్రం ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది..? బాబు హయాంలోనే కేంద్ర ఆర్థిక శాఖ ఎందుకు ప్రశ్నించలేదు.
9- రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాయలసీమ, నెల్లూరు జిల్లాలో భారీగా పంట, ఆస్తుల నష్టం జరిగింది. బాధితులకు తక్షణ సాయంగా రూ. 1000 కోట్ల అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరాం. మొత్తం నష్టం అంచనా వేసి, కేంద్ర సహాయాన్ని రాబట్టేందుకు, కేంద్రం మీద ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.
10- 2021 జనగణన సందర్భంగా.. బీసీ కులాల జనగణన కూడా చేయాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది. బీసీ జనగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. అలానే, రైతులకు దక్కాల్సిన మద్దతు ధరల విషయంలో, రైతు సంఘాలు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన రూ. 4,976 కోట్లు రాబట్టేందుకు ఒత్తిడి తెస్తాం.
11- విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉంది, ఎటువంటి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయటానికి వీల్లేదని స్పష్టంగా చెప్పాం. లేఖలు రాశాం. దీనిపైన కేంద్రంపై ఒత్తిడి తెస్తూ పార్లమెంటులో పోరాడతాం.
12- రాష్ట్రంలో అదనంగా మరో 16 మెడికల్ కాలేజీలు ఏర్పాటుకాబోతున్నందున, అందులో 3 కాలేజీలకు మాత్రమే కేంద్రం నిధులు ఇస్తుంది, మిగతా 13 కాలేజీలకు కూడా కేంద్రం అనుమతిస్తూ, నిధులు ఇవ్వాలని కోరతాం.
13- రాష్ట్రంలో పెద్దఎత్తున చేపడుతున్న పేదల ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి, పేదల కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం రూ. 30 వేల కోట్లు కేంద్రమే భరించాలని పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం.
పేద ప్రజల కోసం ప్రతిక్షణం పోరాడతాం.
14- ప్రత్యేక హోదా అంశాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలే ప్రసక్తే లేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని, ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలానే, విభజన చట్టం ప్రకారం వెనుకబడిన 7 జిల్లాలకు నిలిపివేసిన నిధులను కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా కల్పించినట్లయితే, ఏయే రాయితీలు రాష్ట్రానికి వస్తాయో.. అవన్నీ ఏపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా ఇవ్వమంటే.. అతీగతీ లేదు. రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి వైఖరి అవలంభిస్తుందన్నదే మా భావన.
మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
15- ఎవరైనా చెబితే వరదలు వస్తాయా..? “చంద్రబాబు సముద్రాన్ని ఆపాను. తుపానులను ఆపాను” అని చెబుతారు. మేం అలా చెప్పం. ముఖ్యమంత్రి గారు వరద ప్రభావిత ప్రాంతాలకు వెళితే, సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోతాయి, అందుకే, అధికారులను అక్కడకు పంపించి, ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే నిత్యం సమీక్షలు చేస్తూ, సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. హుద్ హుద్ లో చంద్రబాబు చేసిన డ్రామాలు కాదు ప్రజలకు కావాల్సింది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్స్ గ్రేషియా ఇవ్వడు.. అధికారం పోయిన తర్వాత అంత ఇవ్వాలి, ఇంత ఇవ్వాలని కబుర్లు చెబుతాడు. ఆయన వచ్చేది లేదు. ఇచ్చేది లేదు.
16- ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. సాలూరు నియోజకవర్గంలో ఏర్పాటుకాబోతుంది. రాజధాని విషయంలో సమగ్రమైన బిల్లును తెస్తాం అని ముఖ్యమంత్రిగారు చెప్పారు. రాజధానిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టం. స్టేక్ హోల్డర్స్ అభిప్రాయాలు తీసుకున్నాక, మళ్ళీ సమగ్రమైన బిల్లు తీసుకొస్తాం.

LEAVE A RESPONSE