Suryaa.co.in

Andhra Pradesh

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

-ప్రివిలేజ్ కమిటీలో విజయసాయి రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు
-శాంతి మీద వచ్చిన ఆరోపణలపై విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధం కావాలి
-సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం

ఈ రోజు జిల్లాపార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సోషల్ డెమొక్రటిక్ ఫ్రెంట్ రాష్ట్ర అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు మాదిగని గురునాథం మాట్లాడుతూ విజయ సాయి రెడ్డి స్వలాభం కోసం గిరిజన కుటుంబంతో ఆటలాడుకొని భార్యాభర్తలను రోడ్డున పడేసాడు అన్నారు. శాంతి అనే అధికారిని అడ్డం పెట్టుకొని దేవాదాయ భూములు, వివాదాస్పద భూములు కొల్లగొట్టాడని ఆరోపించారు. గిరిజన బిడ్డలు అయిన శాంతి మదన్మోహన్లను విజయసాయిరెడ్డి విడగొట్టి వారి జీవితాలతో చెలగాటాలు ఆడాడు అన్నారు.

ఎంపీ స్థాయిలో ఉండి కుటుంబాన్ని రక్షించే స్థాయిలో ఉన్న వారిని భక్షించారని తీవ్రస్థాయిలో విమర్శించారు. సోషల్ డెమొక్రటిక్ సంస్థ తరఫున వారి కుటుంబాన్ని కలిపేందుకు ఈ పోరాటం అన్నారు. అంబేద్కర్ గారి పోరాట స్ఫూర్తితోనే వారి కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. శాంతి మదన్మోహన్లకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారన్న సంగతి విజయ్ సాయి రెడ్డి మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు అన్నారు.

విజయసాయిరెడ్డి విలేకరుల సమావేశంలో తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేక విలేకరులపై ఎదురు దాడి చేశారని, అసభ్య పదజాలంతో విలేకరులను దూషించాడని, సాయి రెడ్డి ప్రవర్తన చూసి సభ్య సమాజం చీదరించుకుంది అన్నారు.

జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలని రేపు ఢిల్లీలో ధర్నా చేస్తానని, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు రాకుండా ఉండటానికి మొహం చాటేయడానికి ఈ కార్యక్రమం చేపట్టాడు అన్నారు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యపై ధర్నా చేసే దమ్ముందా జగన్ రెడ్డి అని సవాల్ విసిరారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రన్ని రావనకాష్టం చేసి ఇప్పుడు జగన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించేటట్టు ఉన్నాయి అన్నారు.

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయ్యి రెండు నెలలు కాకముందే జగన్ రెడ్డి విషయం కక్కటం మొదలుపెట్టాడు అన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డిని చీకొట్టిన సిగ్గు రాలేదన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే ఫలితం చేసినా జగన్ రెడ్డిలో మార్పు రాలేదన్నారు.

విజయసాయిరెడ్డి కి దమ్ముంటే డిఎన్ఏ టెస్ట్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. శాంతి మదన్మోహన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఈ పోరాటం ఆగదు అన్నారు. జగన్ రెడ్డికి దమ్ముంటే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని, పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రేపు ఢిల్లీలో వందల మందితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలను కలుపుకొని విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ప్రివిలేజ్ కమిటీలో విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, రాజ్యసభ స్పీకర్ ని, పార్లమెంటు సభ్యులను కలిసి మెమొరాండం సమర్పించి, అనంతరం జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఫిరోజ్, ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు,అబీద్ హుస్సేన్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE