అధికారం కోసం మామనే చంపినోడు చంద్రబాబు

-విద్వంసాన్ని, వినాశనాన్ని కోరుకుంటున్న చంద్రబాబు
-ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డ ఎంపి విజయసాయిరెడ్డి

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మైండే కాదు,వినికిడి శక్తిని కూడా లోపించిందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు చేసిన విమర్శలపై మంగళవారం ఆయన ఘాటుగా స్పందించారు.

ప్లీనరీలో లక్షలాది మంది కర్యకర్తలు అభిమానుల సాక్షిగా విజయమ్మ వివరంగా చెప్పింది వినికిడిలోపం కారణంగా చంద్రబాబుకి సరిగ్గా వినిపించినట్లు లేదని ఆమె ఏం చెప్పారో వినికిడి యంత్రం పెట్టుకొని మరోసారి వినాలని హితవుపలికారు. అధికారంపై వ్యామోహంతో సొంత మామ ఎన్టీఆర్‌ ను చంపినోడికి కుటుంబ బందాలు,ప్రేమల విలువ ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.

వాడెవడో చంద్రబాబుకు రోబో సినిమాలోలా డిస్ట్రక్షన్ చిప్ తగిలించినట్లున్నాడని, అందుకే విధ్వంసాన్ని, వినాశనాన్ని బలంగా కోరుకుంటున్నాడని చెప్పారు. రాష్ట్రంలో టిడిపిని ఓడించారన్న కోపంతో ప్రజలపై చంద్రబాబు కక్ష కట్టాడని మండిపడ్డారు.రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్న సిఎం జగన్ మోహన్ రెడ్డిపై పగతో రగిలిపోతున్నాడని పేర్కొన్నారు.