– విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
ఇది చాలా దురదృష్టకర సంఘటన. బాలిక ఎంతో మనో వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడింది. టీడీపీ నేత వినోద్ జైన్ ఆ బాలికను లైంగికంగా ఇబ్బందులకు గురి చేసాడు. 50ఏళ్ల వయసున్న వినోద్ జైన్ దారుణంగా ప్రవర్తించాడు.
ఎన్నో రకాలుగా అరాచకంగా పాపని ఇబ్బంది పెట్టినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. బాలిక మూడు పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకుందంటే.. ఆమె ఎంత వేదనకు గురైందో అర్ధం చేసుకోవచ్చు లిఫ్ట్ వద్ద, మెట్ల వద్ద అతను అసభ్యంగా ప్రవర్తించాడు. మానవత్వం లేని వ్యక్తికి సంఘంలో చోటు ఉండకూడదు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన వినోద్ తరపున చంద్రబాబు గతంలో ప్రచారం చేసాడు. ఈ ఘటనపై చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు?చంద్రబాబు ఇలాంటివారిని ప్రోత్సహిస్తున్నారు. చంద్రబాబు పార్టీ వాళ్ళే ఇలాంటి ఘటనలకు పాల్పడుతుంటే ఆయన మహిళల గురించి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాపకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ఈ ఘటన పై ముఖ్యమంత్రి జగన్ తీవ్రంగా స్పందించి, నిందితుడిని కఠినంగా శిషించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. పాప తల్లిదండ్రుల బాధను చూడలేకపోతున్నాం నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం.కనకదుర్గమ్మ తల్లి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నాం. బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. వినోద్ జైన్ ను టీడీపీ సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. కచ్చితంగా ఈ ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలి.