Suryaa.co.in

Andhra Pradesh

7న శ్రీపాద శ్రీనివాస్ కు విపంచి ఫౌండేషన్ ఉగాది పురస్కారం ప్రదానం

రాజమహేంద్రవరం: రచయిత శ్రీపాద శ్రీనివాస్ కు ఈ నెల 7వ‌ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో విపంచి ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆయనకు
ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభా పక్ష కార్యాలయంలో సీనియర్ ఉద్యోగి శ్రీపాద శ్రీనివాస్ ప్రవృత్తిగా పలు కథలు, కథానికలు రచించగా అవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారమయ్యాయి. అలాగే “చట్ట సభల్లో గోదావరి గళం ” పుస్తకాన్ని సంకలనం చేసి, చట్టసభలలో ప్రజా ప్రతినిధుల ప్రతిభాపాటవాలను, రాజకీయ సామాజిక విషయాలను అక్షర బద్దం చేశారు.ఆ పుస్తకం పాఠకుల ఆదరణ పొందింది.

ఇక తన స్వీయ భావ రచనలో భాగంగా గుండె చప్పుళ్ళు, మనసున ఉన్నది అంతరంగం, వంటి పుస్తకాలను ప్రచురించి తనదైన సామాజిక జీవన రచనా పటిమను కనబరిచారు.దశల వారీగా ముద్రితమైన ఈ మూడు పుస్తకాలు శ్రీపాద శ్రీనివాస్ లోని రచనా వైశాల్యానికి అద్దం పట్టాయి. ఆయన ఉగాది పురస్కారాన్ని అందుకోనున్న నేపథ్యంలో పలువురు మిత్రులు, రచయితలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A RESPONSE