జగన్ సర్కార్ పై విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

Spread the love

విశాఖ : వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే వినాయక చవితి పండుగ తర్వాత జగన్ సర్కార్ రాష్ట్రంలో ఉండదన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఖాయమన్నారు. వ్యక్తి గత, నైతిక విలువలను సీఎం జగన్ చంపేశారని అన్నారు. తాను ఎప్పుడూ వైఎస్ భారతిని విమర్శించలేదని అన్నారు. ”భారతి గారు సీఎం ఐతే బాగుంటుందని అన్నాను..నా మీద ఏ కేసులు లేవులు.. జగన్‌పై 33 కేసులు ఉన్నాయి.” అని అన్నారు. విశాఖలో వైసీపీ నేత కేకేరాజు కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మంచిదన్నారు. ఢిల్లీలో వందల కోట్లు లిక్కర్ కుంభకోణం జరిగితే..ఆంధ్రాలో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 2 వేల నోట్లు కనిపించడం లేదన్నారు. మళ్ళీ 2 వేల నోట్లు రద్దు చేస్తే.. జగన్ ప్రభుత్వం పడిపోతుందని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు.

Leave a Reply