– ఎప్పుడు గుర్తొచ్చిందన్నది విషయం కాదు వెల్లంపల్లి శ్రీనివాస్ గారూ..
– జరిగిన తప్పును సరిదిద్దటానికి ప్రయత్నిస్తున్నామా లేదా అన్నదే విషయం
– భాజపా ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
అయినా జాతీయ జెండా ఎగురవేయకుండా పోలీసులను పెట్టి అడ్డుకోవడం ఓక భారతీయ పౌరుడుగా మీకు సిగ్గుగా అనిపించడం లేదా ? మొన్న ఆత్మకూరు , నిన్న గుంటూరు రెండు సంఘటనలో కూడా, మీ ప్రభుత్వం దేశ విద్రోహ శక్తులకే కొమ్ము కాస్తున్నారు కదా? జిన్నాటవర్ మీద ఓటు బ్యాంక్ రాజకీయం మీరుచేయకుంటే దేశద్రోహి అయినా జిన్నా పేరును మార్చండి, ఆ టవర్ పైన త్రివర్ణ పతాకాన్ని ఎగరేయండి.
లేదంటే రాష్ట్ర ప్రజలు కచ్చితంగా ఆ పని చేస్తారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకు జరుపుకుంటున్న ఆజాది కా అమృత మహోత్సవం లో భాగంగా,ఆనాడు దేశం కోసం గొప్ప సేవలు చేసి గుర్తింపు రాని వారినెందరినో నేడు గుర్తించి, తగిన గౌరవాన్ని ఇవ్వటం జరుగుతోంది. నాడు జరిగిన అనేక తప్పులను నేడు సరిదిద్దటానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించండి ముఖ్యమంత్రి జగన్ గారు.