వైసీపీ నేతల ఒత్తిళ్లతో ఓట్లు తొలగిస్తున్నారు

– ఫామ్ -7 తో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి రెండు లేఖలు రాసిన తెదేపా నేత వర్ల రామయ్య

• పల్నాడు జిల్లా, ఈపూరు మండలంలోని ప్రతీ గ్రామంలో వైసీపీకి చెందిన వారు తప్పుడు ఫామ్-7 పత్రాలు సమర్పించి దాదాపు 246 టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించారు.
• ఓట్లు తొలగించబడ్డ వారికి ఆధార్, రేషన్ కార్డులు లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు.
• ఓట్లు తొలగించబడ్డవారు వారి వారి గ్రామాలలో అనేక సంవత్సరాలు పాటు జీవిస్తున్నవారే.
• వారు తమ ఓటుకు ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని సైతం ధరఖాస్తు చేసుకున్నారు.
• వైకాపా నాయకులు బి.ఎల్.ఓలపై ఒత్తిడి చేసి టిడిపి సానుభూతిపరులు ఓట్లు తొలగింపచేశారు.
• దీనిపై రాపర్ల సుబ్బారావు అనే టిడిపి నాయకులు తహసిల్‌దార్‌కు సైతం పిర్యాదు చేశారు.
• కావున, అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు ఆదేశాలు జారీ చేయాలని మనవి.
• ఉరవకొండ అసెంబ్లీలోని ఉరవకండ, రాయదుర్గంలోని డీ హీరేహల్, కళ్యాణదుర్గంలోని సెత్తూరు, కుందుర్పి, చిత్తూరు జిల్లాలోని కుప్పం, విజయవాడ సిటీలోని వివిధ పోలింగ్ బూత్‌లలో జరిగిన ఓట్ల అవకతవకలపై ఎస్ఈసీకి పిర్యాదు చేశారు.

Leave a Reply