Suryaa.co.in

Andhra Pradesh

కేంద్రపధకాలను ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నాం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

కేంద్ర ప్రభుత్వ పధకాలను ప్రజలకు తెలియజేయడం తో పాటు లబ్ధిదారులకు అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ లో 50 రధాలతో ప్రచారం నిర్వహిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర రధానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గబాటి పురందేశ్వరి స్వాగతం పలికారు. అనంతరం వికసిత్ భారత్ క్యాలెండర్ ను పురందేశ్వరి ఆవిష్కరించారు అయిదు లక్షల క్యాలెండర్లను ఈ సందర్భంగా ప్రజలకు వితరణ చేయనున్నారు. వికసిత్ భారత్ ఛాయా చిత్రాల ఎగ్జిబిషన్ ను పురందేశ్వరి ప్రారంభించారు

ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడుతూ
వికసిక్ భారత్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా చేస్తున్నాం.కేంద్రం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేస్తాం.కేంద్ర పధకాలకు రాష్ట్ర పధకాలుగా స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేస్తున్నారు చాలా దారుణమన్నారు కేంద్ర పధకాలకు రాష్ట్రప్రభుత్వం ఏవిధంగా స్టిక్కర్లు వేసుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రప్రజలు రధం గ్రామాలకు వచ్చినప్పుడు వెళ్లి కేంద్ర పధకాల వివరాలను తెలుసుకోవాలన్నారు.

ప్రజల కోసం కేంద్రం అమలు చేస్తున్న పధకాలు, సంక్షేమం గురించి తెలుసుకోండి. ఇళ్లు రాని వారు ఆ వ్యాన్ దగ్గరకు వెళ్లి అవసరమైన సమాచారం తెలుసుకోవచ్చు. ఆరోగ్య శ్రీ కి సిఎం నిధులు ఇవ్వక పోవడం వల్ల ఆస్పత్రిలో సేవలు నిలిపి వేస్తున్నారు.కేంద్రం ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలకు ఐదు లక్షల రూపాయల వైద్య సాయం అందిస్తుంది.ఇటువంటి వాటి పై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నాగార్జున సాగర్ వద్ద కు పోలీసులును పంపడం చాలా ఘోరం అన్నారు. నాలుగున్నరేళ్లుగా పట్టించుకోకుండా ఇప్పుడు ఎందుకు హడావుడి ఏం ఆశించి చేస్తున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ను బిజెపి ఖండిస్తుంది. రాష్ట్రం లో 400మండలాల్లో కరవు విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు. అదేవిధంగా కిసాన్ మోర్చా ఆందోళనకు దిగితే రాష్ట్రప్రభుత్వం అణచి వేయాలని చూడడం ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమే అన్నారు. అక్కడే ఉన్న కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామిని పురందేశ్వరి అభినందించారు.
కరవు విషయం లో క్యాబినెట్ లో కూడా చర్చ లేదు.ఎపిలో‌ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే వెతుక్కుంటున్నారు అంటూ ఈ ప్రభుత్వంలో మంత్రలు పాత్ర పాలనలో శూన్యమన్న విషయాన్ని స్పష్టం చేశారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఎవరంటే మాత్రం చెబుతున్నారు.రైతులను ఆడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తో వ్యవహరిస్తుంది ఇరిగేషన్, వ్యవసాయ మంత్రుల పనితీరు రైతులకు ఆమోద యోగ్యంగా లేదన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, మీడియా రాష్ట్ర ఇంచార్జి పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి,మువ్వల వెంకట సుబ్బయ్య, బబ్బూరి శ్రీరాం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, రధయాత్ర ఇంఛార్జిలు పల్లపు రాజు, పిట్టల గోవింద్, ఆర్ముగం,కనిగిరి నీలకంఠం, బోగవల్లి శ్రీధర్, మాదల రమేష్, పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు

ప్రజా ప్రతినిధులు తన దైన ముద్ర వేయాలి
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు ప్రశిక్షణ తరగతులు ను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభోపన్యాసంలో స్ధానిక బిజెపి ప్రజా ప్రతినిధులు ప్రజాసేవలో తనదైన ముద్రవేయాలని సూచించారు. అభివ్రుద్ది విషయంలో బిజెపి ప్రజా ప్రతినిధులు ఏవిధంగా పనిచేస్తారన్న విషయంలో ప్రజల అభిమానాన్ని చూరగొనాలన్నారు

వారి విధులు, బాధ్యతలు, ప్రజల్లో ఏ విధంగా ఉండాలన అంశాలపై వివరిస్తాం
ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధాన కర్తలుగా ఉండేలా శిక్షణ ఇస్తాం.బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ముందుకు వెళతాం.కార్యకర్తలు ఇఛ్చే ఫీడ్ బ్యాక్ ను క్రోడీకరించుకుని జిల్లాల వారీగా సమీక్ష చేస్తాం.ఇంటింటికీ వెళ్లి మోడీ చేస్తున్న అభివృద్ది, సంక్షేమాన్ని వివరిస్తాం అన్నారు. సమావేశానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన బిజెపి జాతీయ ప్రశిక్షణా కార్యక్రమం సభ్యులు సంతోష్ గుప్తా స్ధానిక పరిపాలన ఇతర విషయాల పై మాట్లాడారు. సమావేశాన్ని ఎన్టీఆర్ జిల్లా బిజెపి ఇంఛార్జి కెబి నర్శింగరావు (బ్రహ్మం) ప్రశిక్షణ వర్గ ను పర్యవేక్షించారు.

ప్రశిక్షణా వర్గ వేదిక పై బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ,బిజెపి హెడ్ క్వార్టర్ ఇంఛార్జి మకుటం శివ, మీడియా రాష్ట్ర ఇంచార్జి పాతూరి నాగభూషణం, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE