Suryaa.co.in

Andhra Pradesh

బాధితులకు అండగా ఉంటాం

– కృష్ణలంకలోని 21,22 వ వార్డుల్లో పర్యటించిన గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి

విజయవాడ: వరద ప్రాంతాల్లోని ప్రజలు పరిశుభ్రతను పాటించాలని, అంటు రోగాలు ప్రభల కుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మంత్రి ఆదేశించారు. బాధితులకు అందుతున్న సహాయం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు సహాయక చర్యలో ఎంత మాత్రం అలసత్వం వహించవద్దని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు.

వరద బాధితులకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని, పునరావాస కేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వృద్దులు,గర్భిణీ స్త్రీలకు మూడు పూటల ఆహారం ,అవసరమైన మందులు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

వైద్య శిబిరాల ద్వారా 67 రకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉంచామని, ఒక డాక్టర్, 2 సూపర్వైజర్, ఆశ వర్కర్లు సచివాలయం సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటున్నారని తెలిపారు.

శిబిరంలో అందుతున్న సేవల పట్ల అక్కడ ఉన్న భాధితులతో మాట్లాడి తెలుసుకున్నారు. 21వ వార్డులో జరుగుతున్న పారిశుధ్య పనులను మంత్రి స్వయంగా పర్యవేక్షించారు. పారిశుధ్య పనుల పట్ల అధికారులకు సూచనలు చేశారు.

వరదలకు మరణించిన బాధిత కుటుంబాన్ని మంత్రి పార్థసారథి పరామర్శించారు. ఇటీవల విజయవాడ నగర పాలక సంస్థ పరిధి లోని కృష్ణలంక ప్రాంతం లోని భ్రమరాంబ పురానికి చెందిన పి.చంద్రశేఖర్ బుడమేరు వాగులో కొట్టుకు పోయి చనిపోగా ఆ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.

కృష్ణలంకలోని రమాదేవి నగర్ కట్ట వద్ద వరద భాదితులకు ఆహారం,మంచి నీరు,పాలు పంపిణీ చేశారు.మంత్రి వెంట చింతలపూడి మాజీ శాసన సభ్యులు గంటా మురళి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE