అధ్బుతమైన ఘట్టం వీక్షించాం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

శ్రీ శైలం: అత్యద్భుతమైన ఘట్టం వీక్షించాం అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అయోధ్య బాలరాముడు విగ్రహం ప్రాణ ప్రతిష్ట వీక్షణ అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ అయోధ్య స్వయం గా వెళ్ళలేక పోయినా దేశం ప్రజలందరూ టివీ మాధ్యమంగా వీక్షించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమం కోసం ఎంతో నిష్టగా ఉన్నారన్నారు ఈ పుణ్యఫలం దేశం లోని 144కోట్లమందికి దక్కాలని సంకల్పించారు అన్నారుఈరోజు మల్లిఖార్జున స్వామి ని దర్శనం చేసుకున్న అనంతరం ఈ ప్రాంగణంలో అయోధ్య బాలరాముడు ప్రాణ ప్రతిష్ట వీక్షణ చేయడం భగవంతుని ఆశీస్సులు గా భావిస్తున్నాను అన్నారు. రామభక్తులు సమక్షంలో ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply