ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై, అధికారానికి తలొగ్గిన ఐఏఎస్, ఐపీఎస్ ల తీరుపై న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం
– తప్పుచేసినవారిని శిక్షించే తీరుతాం
• రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిసహా, కిందిస్థాయి సిబ్బందివరకు ఎవరినీ వదిలేదిలేదు.
• గెలుపుకోసం జగన్ అధికారం, డబ్బు, మద్యం, గంజాయి, కరెన్సీకట్టలనే నమ్ముకున్నాడు.
• తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు చేసింది సబబేనని ముఖేశ్ కుమార్ మీనా చెప్పగలడా?
• వై.వీ.సుబ్బారెడ్డి విశాఖపట్నంలో పోలింగ్ బూత్ లో చేస్తున్నప్రచారం అక్కడి ఎస్పీ, కలెక్టర్లకు కనిపించలేదా?
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
జగన్మోహన్ రెడ్డిపాలనలో ప్రజాస్వామ్యం ఎంతదారుణంగా అపహాస్యానికి గురవుతోందో చెప్ప డానికి రాష్ట్రంలో నేడుజరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే నిదర్శనమని, గెలుపుకోసం ఏ ముఖ్యమం త్రి, ఏ అధికారయంత్రాంగం దేశచరిత్రలో ఎన్నడూ చేయని దుర్మార్గపు ఆలోచనలు చేశారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు . ఆ వివరాలు ఆయనమాటల్లోనే …
“తిరుపతిలోని ఓ పోలింగ్ బూత్ లో అనర్హులైన ఆటోడ్రైవర్లు ఓట్లువేశారు. వారువేసిన దొంగ ఓట్లకోసం స్థానిక విద్యుత్ ఏఈసంతకాన్ని వైసీపీనేతలే ఫోర్జరీచేశారు. గ్రాడ్యుయేట్స్ కు మాత్ర మే ఉండాల్సిన ఓటుని 5, 6, 7, 10వ తరగతి చదివినవారికి కూడా కల్పించారు. ఒక్క తిరు పతే కాదు..రాష్ట్రవ్యాప్తంగా నమోదైన దొంగఓట్ల వివరాలపై ఆధారాలతోసహా టీడీపీ రాష్ట్ర ఎ న్నికల కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదుచేసింది.
అధికారం, డబ్బుమదంతో ఎన్నికలు నిర్వహిస్తుంటే రాష్ట్రఎన్నికల కమిషనర్ ఏం చేస్తున్నారు? టీడీపీ ఫిర్యాదులపై ముఖేశ్ కుమార్ మీనా స్పందించలేదు
అధికారాన్ని అడ్డుపెట్టుకొని, డబ్బుమదంతో పాలకులు ఎన్నికల్ని ఈ విధంగా ప్రహాసనంగా మారుస్తుంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏంచేస్తున్నారు? మేం ఇచ్చినఫిర్యాదులపై అసలు సీఈసీ చర్యలు తీసుకున్నారా? టీడీపీ ఫిర్యాదుపై సీఈసీ స్పందించకపోబట్టే, నేడు రాష్ట్రవ్యా ప్తంగా వైసీపీనేతలు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బూత్ క్యాప్చర్లు, రిగ్గింగులు చేశా రు. ఇవన్నీచేసేబదులు తమవారే గెలిచారని అధికారులతో ప్రకటింపచేసుకుంటే సరిపోయేది కదా! తిరుపతిలో ఇద్దరు కార్పొరేటర్లు గతంలోసమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో ఇంటర్ చదివారని చెప్పారు. మునిరత్నంరెడ్డి, ఎస్.కే.బాబు అనే ఇద్దరు వైసీపీకార్పొరేటర్లకు గ్రాడ్యు యేట్స్ ఎలా అయ్యారు? మునిరత్నం రెడ్డి పోలింగ్ బూత్ నెం-228లో, 156వ ఓటు వేసేశా డు. బాబు కూడా తనఓటు వినియోగించుకున్నాడు. వారిపై తాము రాష్ట్రఎన్నికల అధికారికి ఫిర్యాదుచేసినా వారిపేర్లు ఓటర్లజాబితానుంచి ఎందుకు తొలగించలేదు? ఉమ్మడి చిత్తూరుజిల్లాలో 45రోజులనుంచీ పాదయాత్రచేస్తున్న లోకేశ్ ను బయటకుపంపిన పోలీస్ అధికారులు, ఎమ్మెల్సీ ఎన్నికలుజరిగే ప్రాంతాల్లో యథేచ్ఛగా తిరుగుతున్న వైసీపీనే తల్ని ఎందుకు ఉపేక్షించారు. విశాఖపట్నంలో వై.వీ.సుబ్బారెడ్డి పోలింగ్ బూత్ లవద్ద చేస్తు న్న ప్రచారం పోలీసులకు, రాష్ట్రఎన్నికల సంఘానికి కనిపించలేదా? తిరుపతిలో వైసీపీఎమ్మె ల్యే భూమనకరుణాకర్ రెడ్డి, అతనికుమారుడు అభినయ్ రెడ్డి పోలింగ్ బూత్ లలోకి వెళ్లి, దొంగఓట్లు వేయిస్తుంటే పోలీసులు చోద్యం చూశారు. వారిని ఎలా అనుమతిస్తారని ప్రశ్నించిన పాపానికి టీడీపీఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు. ఏకారణం లేకుండా ఎన్నికలఏజెంట్లను అరెస్ట్ చేసేఅధికారం పోలీసులకు ఉందా? పులిగోరు రాముసహా, 30మం ది టీడీపీనేతల్ని, ఏజెంట్లను పోలీసులు అకారణంగా అరెస్ట్ చేశారు. పోలీసులు తప్పుడు అరె స్టులకు పరిమితమైతే, ఎమ్మెల్యే, ఆయనకుమారుడు వారిఅనుచరులతో కలిసి ఇష్టానుసా రం రిగ్గింగ్ చేసుకున్నారు.
ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ అధికారం, డబ్బు, మద్యం, గంజాయి, కరెన్సీనే నమ్ముకున్నాడు… ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఉండి జగన్ ఆదేశాలతో పనిచేసినవారంతా న్యాయస్థానాల శిక్షకు గురికాకతప్పదు
ఒక ఎమ్మెల్సీస్థానం గెలుపుతో తనకు ఏం ఒరుగుతుందో జగన్ సమాధానం చెప్పాలి? గెలు పుకోసం దొంగఓట్లు, కరెన్సీకట్టలు, ప్రతిపక్షనేతల ముందస్తు అరెస్ట్ లు, గంజాయి, పక్కరాష్ట్రాల మద్యాన్నే జగన్ నమ్ముకున్నాడు. జగన్ వచ్చేఎన్నికల్లో ఇలానే వ్యవహరిస్తే రాష్ట్రంలోని 175స్థా నాలతో పాటు, పొరుగురాష్ట్రాల్లోని సీట్లుకూడా గెలుస్తాడు. తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, కలెక్టర్లకు టీడీపీఅధినేత చంద్రబాబు పలుమార్లు ఫోన్ చేశారు. ఎన్నికలు సజావుగా, చట్టబ ద్ధంగా నిర్వహించాలని కోరారు. ఒంగోలుఎస్పీ, కలెక్టర్లతోకూడా మాట్లాడా రు. ఉదయం నుంచి పోలింగ్ ముగిసేవరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఏపీ సీఈసీకి ఫి ర్యాదుచేసినా చర్యలులేవు. తిరుపతిలో పోలింగ్ బూత్ 229లో వైసీపీరౌడీమూకలు చొరబడి, బ్యాలెట్లు గుద్దుకుంటుంటే, దానిపై తాము ఫిర్యాదు చేస్తే, కలెక్టర్ తీరుబడిగా అక్కడికెళ్లి, రీ పోలింగ్ చేస్తామని ప్రకటించారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో కూడా భారీఎత్తున అధికారపార్టీ దొంగఓట్లునమోదుచేయించి గెలిచింది. స్థానిక ఎన్నికల్లో కూడా అధికారం, డబ్బు, పోలీస్ బలగాలనే ఉపయోగించి వైసీపీ గెలిచింది. తాము చేసిన ఫిర్యాదులపై రాష్ట్రఎన్నికల కమిషనర్ ఏమాత్రం స్పందించలేదు. ఏపీ సీఈసీ వ్యవహారశైలిపై, హైకోర్ట్ ని ఆశ్రయించాలని నిర్ణయించాము. తిరుపతిఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, తిరుపతి కలెక్టర్, వారి ఆదేశాలతో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన కిందిస్థాయి సిబ్బంది అందరూ కోర్టులో శిక్షను ఎదుర్కోబోతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు చదివింది దొంగఓట్లు వేయించడానికా” అని బొండా ఉమ ప్రశ్నించారు.