ఏపీ జెన్కో ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

– ఏపీ జెన్కో పరిరక్షణ కమిటీ, జేఏసీ

శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జెన్కో మేనేజ్మెంట్ టెండర్ల ప్రక్రియను నిర్వహించడం శోచనీయమని ,టెండర్ల ప్రక్రియను వెంటనే ఆపు చేయాలని ఏపీ జెన్కో జేఏసీ మరియు పరిరక్షణ కమిటీ డిమాండ్ చేశాయి. ఏపీ జెన్కో పరిరక్షణ కమిటీ మరియు జేఏసీ సమావేశం నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు లోని టిడిపి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు జరిగింది.

టెండర్ల ప్రక్రియను ఆపు చేసేందుకు మరియు ఏపీ జెన్కోకు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం .మోహన్ రావు ,టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కే .రాంబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి గోగుల శ్రీనివాసులు ,టిడిపి నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, తాళ్లపాక అనురాధ, బొమ్మి సురేంద్ర ,ఏపీ జెన్కో జేఏసీ నాయకులు సిహెచ్. ఆదిశేషయ్య, నక్క మోహన్ రావు ,ఎం .రవీంద్ర, భాస్కర్ ,సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply