– అసెంబ్లీ కి వస్తే హోదా నాయకుడికి వచ్చే బెనిఫిట్స్ అన్ని చందాల రూపంలో ఇస్తాం
– విమానం టికెట్లు, రైల్వే టికెట్లు, పిఏ జీతాలు ,వాహనాల డీజిల్ అన్ని అందిస్తాం
– అసెంబ్లీ లో జగన్ పై సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
అమరావతి: గవర్నర్ ప్రసంగం వల్ల రాష్ట్ర ప్రజలకు, రైతులకు, ఉద్యోగులకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఉద్యోగం, ఉపాధి, వ్యవసాయం, నీటి పారుదల శాఖలన్నీ ఒక ట్రాక్లో పడతాయని నమ్మకం వచ్చింది. జగన్ దమ్ముంటే అసెంబ్లీ కి రావాలి..పులివెందులకు ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందో, వస్తే ఆ సీటు కూడా పోతుందని 60 రోజులకు ఒకసారి అసెంబ్లీకి వచ్చి కనిపించడం సరికాదు.
జగన్ అసెంబ్లీ కి వస్తే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష హోదా నాయకుడికి వచ్చే బెనిఫిట్స్ అన్ని తాము చందాల రూపంలో ఇస్తాం. విమానం టికెట్లు, రైల్వే టికెట్లు, పిఏ జీతాలు ,వాహనాల డీజిల్ అన్ని తాము అందిస్తాం. ఎన్నికల్లో గెలిచిన వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గానికి ప్రతినిధులుగా ఉండి సమస్యలపై అసెంబ్లీలో పోరాడకుండా నిబంధనలకు విరుద్ధంగా తమ నాయకుడికి ప్రతిపక్ష హోదా కావాలనడం విడ్డూరంగా ఉంది.
పదేపదే జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలంటున్నాడు .2010లో తమిళనాడులో ఏడీఎంకే డిఎండికే కలిసి పోటీ చేశాయని ఏడీఎంకే సున్నా, డిఎండి కేకు 29 సీట్లు వచ్చాయని, విజయకాంత్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చారని, అయితే ఎనిమిది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించడంతో విజయకాంత్ ప్రతిపక్ష హోదా కోల్పోయాడన్నారు
అలాగే 2014లో కాంగ్రెస్ 543 స్థానాల్లో 44 స్థానాలు సాధించిన ప్రతిపక్ష హోదా రాలేదని, అలాగే 2019 లో 52 స్థానాలతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ,2024 లో 99 సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా ఇచ్చారని 2024 లో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లిన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందని ఇలాంటి సందర్భాలను గుర్తుచేశారు.
ఇదే వైయస్ జగన్ 23 స్థానాలు సాధించిన చంద్రబాబును గతంలో హెచ్చరించారని ఆరు స్థానాలు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని వ్యంగ్యంగా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశారు. బిజెపి నాయకులు, సీ.పీ.ఎం, ఎంఐఏం నాయకులు ఫ్లోర్ లీడర్లుగానే పనిచేస్తారని గుర్తు చేశారు
జగన్ కు ప్రతిపక్ష హోదాలో లభించే బెనిఫిట్స్ కావాలంటే విమానం టికెట్లు, రైలు టికెట్లు ,పీఏ జీతాలు, వాహనాల డీజిల్ అన్ని చందాలు వేసుకొని ఇస్తామన్నారు. అసెంబ్లీ కి రాకుంటే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని 60 రోజులకు ఒకసారి జగన్ అసెంబ్లీలో కనిపించి వెళ్తున్నారని,వైసీపీ అధికారంలోకి రాగానే అందరిని బొక్కలో వేస్తామని బెదిరిస్తున్నారు. దమ్ముంటే జగన్ శాసనసభకు రావాలన్నారు. నీటిపారుదల, వ్యవసాయం, జలజీవన్ మిషన్,ను జగన్ ప్రభుత్వం మూసేసిందని, రోడ్లు ను వదిలేసారన్నారు.
అలాగే ప్రజలకు, రైతాంగానికి ఉపయోగాన్ని ఇచ్చే ప్రాజెక్టు వ్యయాలను 50% శాతం కంటే తగ్గించి, నిధులు లేవని చూపారు. మైక్రో ఇరిగేషన్, బిందు తుంపర్ల సేద్యం, యాంత్రీకరణను మూసేశారన్నారు .నాబార్డ్ నిధులు కూడా లేవన్నారు. డ్రిప్ ఇరిగేషన్, అమరావతి రాజధాని,రోడ్ల మరమ్మత్తులు, పోలవరం, కొత్త ప్రాజెక్టులన్ని కూటమి ప్రభుత్వం లో ప్రారంభమవుతున్నాయన్నారు. 6 కోట్ల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడం శుభ సూచికమన్నారు.
ఒక్క మంత్రి కూడా జగన్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గడప తొక్కలేకపోయారన్నారు.అలాగే వైసిపి ప్రభుత్వం లో భూ కుంభకోణాలు భారీగా జరిగాయి.భూములను ఫ్రీ హోల్డ్ చేసి అమాయకుల పొట్ట కొట్టి ,ఆ భూముల పట్టాలు సాధించి వైసీపీ నాయకులంతా ల్యాండ్ ఓనర్లు అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయడం గొప్ప వరమని ,కూటమి ప్రభుత్వములో పీ.ఎం నరేంద్ర మోడీ అండ, పవన్ కళ్యాణ్ ఫోర్స్ ,బాబు దార్శినికత తో రాష్ట్రం ముందుకెళ్లుతుందన్నారు.