• ఆ ప్రయత్నం కూడా ఏనాడు చేయలేదు
• వైసీపీ పాలన అంతా అప్పుల కుప్పే.. సిగ్గులేకుండా బడ్జెట్ పై పిచ్చి ప్రేలాపనలు
• నేడు రాష్ట్రం ఆదాయంవైపు అడుగులు వేస్తోంది
• ఇది వైసీపీ మూకలకు మింగుడు పడటంలేదు
• అనేక పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి
• రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లు నిరంతరం కృషి చేస్తున్నారు
• అమరావతిని శ్మశానం చేశారు.. మూడు రాజధానుల పేరుతో మోసం
• చంద్రబాబు పాలనలో నాలుగు నెలల్లోనే 60 వేల కోట్ల పెట్టుబడులు
• రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం
• టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
మంగళగిరి: ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తుంటే.. వైసీపీ అధినేత జగన్, మాజీ మంత్రి బుగ్గనలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు… అమాయక చక్రవర్తుల్లా మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారనుకుంటున్నారో ఏమో….
కాగ్(కంప్ట్రోలర్ ఆడిట్ జనరల్) నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఆరునెలల్లో దాదాపు రూ. 3,900 కోట్ల ఆదాయం పెరిగిందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే అప్పులు తగ్గాయి. గత పాలనలో అప్పులు పెరగడమే కాని తగ్గింది ఏనాడు లేదు. ఇది అంతా బహిరంగంగానే ఆన్ లైన్ లో చూసుకోవచ్చు అన్నారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. . 24 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తోందని వైసీపీ నేతలు పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు.
నాలుగు నెలల్లో దాదాపు రూ. 4 వేలకోట్ల ఆదాయం తీసుకు రాగలిగిన ప్రభుత్వం మిగిలిన 8 నెలల్లో 24 వేల కోట్లు తీసుకురాలేమా? అమరావతి నిర్మాణంకు రూ.15 వేల కోట్లు ఇచ్చేందు వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. దీనికి సంబంధించిన సంతకాలు కూడా జరిగాయి. హడ్కో ద్వారా రూ. 12 వేల కోట్లు వస్తున్నాయి. మరోవైపు ఐటీ మంత్రి లోకేష్ అమెరికాలో కాళ్లు అరిగేలా తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులను వరదాలా తీసుకు వచ్చేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతి రోజు కృషి చేస్తున్నారు. ఏనాడైనా ఒక్క పారిశ్రామిక వేత్తతో మాట్లాడారా జగన్ రెడ్డి మీరు? ఏనాడైనా సెక్రటేరియేట్ కు వచ్చారా? మళ్లీ మీరు సిగ్గులేకుండా పెట్టుబడులు, ఆదాయం, అప్పుల గురించి మాట్లాడుతున్నారు.
చంద్రబాబు కృషితో గ్రాద్రెజ్ సంస్థ రాష్ట్రంలో రూ. 3000 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. హెచ్‌సీఎల్ కంపెనీ తన ఉద్యోగస్తులను 15 వేలకు పెంచుతోంది. వీటితో పాటు అనేక పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్ర ఆదాయం పెరుగుతోంది. సంపద సృష్టించడం ఒక కళ. అది వైసీపీ నేతలకు తెలియదు. అటువంటి ప్రయత్నం కూడా వైసీపీ నేతలు ఏనాడు చేయలేదు. అప్పులు తెచ్చి మేనేజ్ చేయడం తప్ప. చివరకు మద్యం, ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టారు. మళ్లీ ఇప్పుడు సిగ్గులేకుండా బుగ్గన మాట్లాడుతున్నారు.
అమరావతిని శ్మశానం చేశారు. మూడు రాజధానుల పేరుతో వైజాగ్ ను ముంచారు. నేడు కూటమి ఏమి చేయడంలేదంటూ అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ నేతలకంటే ఘనులు ఎవరూ లేరు. జగన్ రెడ్డి అధికారం చేపట్టిన మొదటి ఐదు నెలల్లో చేసిన పని రూ. 250 పింఛన్ పెంచడం, ఆటో డ్రైవర్లకు రూ. 10 వేలు ఇవ్వడం అంతే. అధికారంలో ఉంటే ఒకలా అధికారం పోతే మరోలా వ్యవహరించడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. మేం అధికారం చేపట్టిన వెంటనే చెప్పినట్లు రూ. 1000 పింఛన్ పెంచి అందించాం, అన్న క్యాంటీన్ లు పెట్టాం, దీపం 2 కింది గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకుండా మీరు మోసం చేస్తే మేము చెల్లించాం. మేం చెప్పిన విధంగానే అన్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. మీలా మోసం చేయడంలేదు. చెప్పినట్లే తల్లికి వందనం కూడా ఇస్తాం. మీరు అమ్మఒడి ఎన్నిరోజులకు ఇచ్చారు. అధికారం చేపట్టిన 8 నెలల తరువాత ఇచ్చారు.
రైతులకు దక్కాల్సిన బెన్ఫిట్స్ ను సకాలంలో ఇవ్వకుండా వారిని కూడా మోసగించారు. మళ్లీ మీరు నేడు సిగ్గులేకుండా మాట్లాడుతారా? ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన మతిలేకుండా అప్పులపై మాట్లాడుతున్నారు. బడ్జెట్ లో ఏ అప్పులు చూపిస్తారో ఏ అప్పులు చూపించరో అది కూడా బుగ్గనకు తెలియకపోవడం శోచనీయం. ఆర్భీఐ ద్వారా తెచ్చిన అప్పులు, స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటీ ద్వారా తెచ్చిన అప్పులను మాత్రమే మంత్రి పయ్యావుల బడ్జెట్ లో చూపించారు. మిగిలిన మీరు చేసిన అప్పులన్నీ ఛాంతాండంతా ఉంది.
2023-24 లో మీరు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీ రూ. 3,400 కోట్లు ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఎఫ్ మెడికల్ రీ యింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించలేదు అది అప్పుకాదా?
ఆరోగ్య శ్రీకి చెల్లించాల్సి డబ్బులు చెల్లించకుండా వెళ్లారు అది అప్పుకాదా? పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన నిధులు, నాన్ గ్యారెంటీ రుణాలు, వివిధ కార్పొరేషన్ ల ద్వారా ఎపీఎస్ఎఫ్సీలో డిపాజిట్లు చేయించి డబ్బులు తీసుకుని వాడేశారు ఇవన్నీ అప్పులు కాదా?. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి కూడా రూ.450 కోట్లు తీసుకుని వాడేశారు. ఉన్నత విద్యామండలి, ఇంటర్ మీడియట్ బోర్డు, నన్నయ్య యూనివర్శిటీ, ఆంధ్ర యూనివర్శిటీ, జేఎన్టీయూ కాకినాడ అని దేన్ని వదలకుండా ఎపీఎస్ఎఫ్సీలో డిపాజిట్ చేయించి పిల్లలు కట్టిన ఫీజులను కూడా వాడేశారు. ఇవన్నీ అప్పులు కాదా జగన్ రెడ్డి?
ఎప్పటికైనా ప్రభుత్వం ఈ డబ్బులు తిరిగి చెల్లించాలి కదా? చివరికి డ్వాక్రా మహిళలు దాచుకున్న డబ్బులను కూడా వాడుకున్నారే ఎవరికి చెబుతున్నారు మళ్లీ సిగ్గులేకుండా? మద్యం బాండ్లు, ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, జన్కో, ట్రాన్స్ కో పీఎఫ్ లు, నాబార్డ్ లో లోన్లు… దేన్ని వదలకుండా అప్పులు చేసి మళ్లీ అప్పులు చేయలేందంటూ మేం సుద్దపూసలమంటే జనాలు ఎలా నమ్ముతారు? మీకు సంపాదించడం తెలియదు.. నాలుగు నెలల్లోనే అప్పులను తగ్గించి రాష్ట్రంలో ఆదాయం పెంచేందుకు కేంద్ర సహకారంతో కూటమిని నేతలు సర్వశక్తులా ప్రయత్నించి.. రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుతున్నారు. జగన్ రెడ్డి, బుగ్గన, సత్యనారాయణ, రావత్ లే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్లీ నేడు మీ అబద్దాలతో మంచి జరుగుతున్న రాష్ట్రంలో విషం చిమ్ముతున్నారు.