సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటింటికీ చేర్చాం

– పేదలను ఆదుకొనేందుకు నిరంతరం శ్రమిస్తాం
– ఎం ఎల్ ఏ పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఇంటికీ తమ వంతు సహకారాన్ని అందించేందుకు కృషి చేసుట్టమని సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట కు చెందిన శ్రీనివాస్, పార్సీ గుట్ట కు చెందిన విజయ్ కుమార్ లు అనారోగ్యంతో సతమతమవుతూ సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ కార్యాలయాన్ని తగిన సాయం కోసం ఆశ్రయించగా వెంటనే స్పందించిన పద్మారావు గౌడ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి శ్రీనివాస్ కు రూ.1.50 లక్షలు, విజయ్ కుమార్ కు రూ. లక్ష మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ ఎం ఆర్ ఎఫ్) ద్వారా ఎల్ ఓ సీ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతున్నామని, ప్రజలు తమ సమస్యలకు తమ కార్యాలయాన్ని సంప్రదించ వచ్చునని అన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీనివాస్ నగర్ లోని చరిత్రాత్మకమైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో సహకరిస్తామని, సికింద్రాబాద్ ఎం ఎల్ ఏ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఆలయం నిర్వాహకులు ముద్రించిన వార్షిక క్యాలెండర్ ను పద్మారావు గౌడ్ శుక్రవారం సితాఫలమండీ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు.

Leave a Reply