అవును.. నిన్ను చూసి వాళ్లంతా సిగ్గు పడాలి సోదరా?!

ఆత్మగౌరవం అడ్డొచ్చి కాళ్లు లేకున్నా కష్టపడుతున్న నిన్ను చూసి… వేల కోట్ల ఆస్తులు ఉన్నా రైతుబంధు తీసుకుంటున్న వాళ్లు…. వేల కోట్ల ఆస్తులున్నా వందలాది కోట్లు బ్యాంకులను ముంచుతున్న వాళ్లు,…… వేల కోట్ల ఆస్తులు ఉండి ఒక్క రూపాయి కూడా సమాజానికి ఖర్చు చేయని వాళ్ళు……. అన్ని అవయవాలు బాగుండి , ప్రజాస్వామ్యంలో పెద్దమనుషులమనే ముసుగేసుకుని.. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, అవినీతికి పాల్పడుతున్న వాళ్లు బుద్ధి తెచ్చుకోవాలి. నిన్ను చూసి గర్వపడుతున్నా సోదరా!

ఇప్పుడు ఈ వీడియో కన్నడనాట సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తెలంగాణలో ఆదాయపన్ను కట్టి, వందలకోట్లున్న ధనవంతులు సైతం నిస్సిగ్గుగా రైతుబంధు తీసుకుంటున్న వారందరూ ఈ వీడియో చూసి సిగ్గుపడాలి. వికలాంగుడై ఉండి కూడా పుణ్యానికి డబ్బులు తీసుకోకుండా.. సర్కారు విదిలించే ఎంగిలి పథకాలకు జోలె పెట్టకుండా, తన కాయకష్టంతో సంపాదిస్తున్న తీరు చూసి.. మన తెలుగు రాష్ట్రాల్లో, అన్ని అవయవాలు సవ్యంగా ఉండి.. సర్కారు సొమ్మును తేరగా తెగ తినేస్తున్న వారంతా, కచ్చితంగా సిగ్గుతో తలదించుకోవాలి. సిగ్గుంటే!

Leave a Reply