Suryaa.co.in

Andhra Pradesh

కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం

– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి.
– భీమడోలు మండలం ఆగడాలలంకలో తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్.

భీమడోలు: కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. భీమడోలు మండలం ఆగడాలలంకలో తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తో కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు.

ఆగడాల లంక ప్రధాన కూడలిలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ మహేష్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. రూ. 100 సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. బీమా సదుపాయంతో పాటు విద్య, వైద్యం వంటి సదుపాయాలు పార్టీ కల్పిస్తుందని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం అని, సార్వత్రిక ఎన్నికల్లో ప్రాణాలు అడ్డుపెట్టి మరి కార్యకర్తలు పార్టీని గెలిపించారని ఎంపీ మహేష్ కుమార్ కొనియాడారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఏలూరు పార్లమెంటు పరిధిలో అత్యధిక సభ్యత్వాలు పూర్తి చేయాలని ఎంపీ మహేష్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE