నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు ఏ ఏ స్థాయిలో ఉన్నారో.. చూడండి. మోడీ సాబ్.. ఫకీర్, చాయ్ అమ్మేవాడు, చౌకీ దార్.. అంటే నమ్మేసిన వారికోసం..
వివిధ హోదాల్లోవున్న మోదీ గారి బంధువులు మచ్చుకు కొందరు..
1. సోమాభాయ్ మోడీ (75 సంవత్సరాలు) రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ – ప్రస్తుతం గుజరాత్‌లో రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్.
2. అమృత్‌భాయ్ మోడీ (72 సంవత్సరాలు) ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేసేవారు, ప్రస్తుతం అహ్మదాబాద్ & గాంధీనగర్‌లలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి.
3. ప్రహ్లాద్ మోడీ (64 సంవత్సరాలు) చౌకైన ధాన్యం (రేషన్) దుకాణాన్ని కలిగి ఉన్నారు, ప్రస్తుతం అహ్మదాబాద్, వడోదరలో హ్యుందాయ్, మారుతీ మరియు హోండా ఫోర్ వీలర్ షోరూమ్‌లు ఉన్నాయి.
4. పంకజ్ మోదీ (58 సంవత్సరాలు) గతంలో సమాచార శాఖలో ఉన్నారు, నేడు సోంభాయ్‌తో పాటు రిక్రూట్‌మెంట్ బోర్డులో వైస్-ఛైర్మెన్‌గా ఉన్నారు.
5. కిరాణా దుకాణం యజమాని అయిన భోగిలాల్ మోదీ (వయస్సు 67) నేడు అహ్మదాబాద్, సూరత్ మరియు వడోదరలో రిలయన్స్ మాల్స్‌ను కలిగి ఉన్నారు.
6. అరవింద్ మోదీ (వయస్సు 64) స్క్రాప్ డీలర్, ప్రస్తుతం పెద్ద భవన నిర్మాణ కంపెనీలకు రియల్ ఎస్టేట్ మరియు స్టీల్ కాంట్రాక్టర్.
7. భరత్ మోదీ (55 ఏళ్లు) పెట్రోల్ పంపులో పనిచేసేవారు. ఈ రోజు వారికి అహ్మదాబాద్‌లో పదకొండు పెట్రోల్ పంపులు ఉన్నాయి.
8. అశోక్ మోడీ (51 సంవత్సరాలు) గాలిపటాలు మరియు కిరాణా దుకాణం కలిగి ఉన్నారు. ఈరోజు ఆయన భోగిలాల్ మోదీతో కలిసి రిలయన్స్‌లో భాగస్వామి.
9. చంద్రకాంత్ మోదీ (48 ఏళ్లు) గోశాలలో పనిచేస్తున్నాడు. నేడు, అహ్మదాబాద్ మరియు గాంధీనగర్‌లలో తొమ్మిది ప్రధాన పాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.
10. రమేష్ మోదీ (57 సంవత్సరాలు) ఉపాధ్యాయునిగా పనిచేశారు, ఈరోజు ఆయనకు ఐదు పాఠశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, ఆయుర్వేదం, హోమియోపతి, ఫిజియోథెరపీ కళాశాలలు మరియు వైద్య కళాశాలలు ఉన్నాయి.
11. గతంలో ట్యూషన్ సెంటర్‌లో పనిచేసే భార్గవ మోదీ (44 ఏళ్లు) ఇప్పుడు రమేష్ మోదీ సంస్థల్లో భాగస్వామి.
12. బిపిన్ మోదీ (42 ఏళ్లు) అహ్మదాబాద్ లైబ్రరీలో పనిచేస్తున్నారు. ఈరోజు KG నుండి XII తరగతి వరకు పాఠశాల పుస్తకాలను సరఫరా చేసే పుస్తక ప్రచురణ సంస్థలో భాగస్వామి.
నంబర్ 1 నుండి 4 వరకు ప్రధాని మోదీ సోదరులు. 5 నుంచి 9 వరకు ఉన్న వారు ప్రధాని మోదీ బంధువులు. నెంబర్ 10 ప్రధాని మోదీ మేనమామ జగ్జీవందాస్ మోదీ కుమారుడు. 11 భార్గవ కాంతిలాల్, 12 బిపిన్ వీరు ప్రధాని చిన్న మేనమామ జయంతిలాల్ మోడీ కుమారులు.
బంధాలు లేవు, బంధుప్రీతి వుండదు, తినరు..తిననివ్వరు, ఇలా అనుకుంటున్నాం కానీ, ఇట్లాంటి విషయాలేవీ మీడియా మనకు చెప్పదు. తమ లాభం మాత్రమే చూసుకుంటుంది. ప్రజాధనం విచ్చలవిడిగా తమకు సమర్పించే ప్రభుత్వాలనే వారు సమర్ధిస్తారు.
మనల్నీ.. మన ఆర్ధిక స్థితిగతులను.. ప్రతి నిత్యం నియంత్రిస్తూ.. మన కష్టార్జితాన్నంతా సంపదగా మలుచుకుని, తమ మందీ మార్బలానికి దారపోసే కార్యక్రమాలు నిర్విరామంగా నడుస్తున్నాయి. వీరి అధికారంతో, కార్పోరేట్ కుబేరులు పేర్లు ఫోర్బ్ బిలియనీర్స్ లిస్ట్ లో రోజు రొజుకూ పైకి ఎగబాకుతున్నాయి.
ప్రతి వస్తువుకు తయారీధర మీద, పన్నులు లాభాలు కలిపి, రెండు మూడురెట్లు మార్జిన్లు వేసుకుంటున్నారు. 95రూపాయల నూనె ప్యాకెట్ కు 185 రూపాయలకు ధరను పెంచేశారు. 40రూపాయల పెట్రోలును 111 రూపాయలకు, ₹300 గ్యాస్ బండను ₹1200 లకు, యూనిట్ ₹2.50 కొనే కరెంటుకు ₹5.50 నుంచి ₹9.50 వసూలు చేస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వస్తువుమీదా దోపిడీయె. ఎన్నికల సమయం దగ్గరపడగానే కొద్దినెలలు ఓ ఇరవై ముప్పై తగ్గించి దయచూపిస్తారు.
ప్రజల జీవితాల్లోన్ని ఆర్ధిక స్వాతంత్ర్యాన్నంతా హరించి, కేవలం వీరికి సంపదను పెంచే యంత్రాలుగా మాత్రమే పరిగణిస్తూ.. సామాన్య మధ్యతరగతి కుటుంబాలను ఎదగనీయకుండా, ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు.
ఎవరు ఎట్లాంటి వాళ్లో కనిపెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సింది, స్టూడియో చర్చల్లో అరుస్తూ గగ్గోలు పెట్టే ఓటెయ్యని మేధావులు కాదు. ఇంటింటికీ వచ్చి రాజకీయ పార్టీలు పంచి పెట్టే పచ్చ నోటును చూసి.. వారు తన గుమ్మం దాకా వచ్చారంటే తన ఓటు ఎంతటి విలువైనదో తెలుసుకుని, ఎవరెకి వెయ్యాలనుకున్నాడో వారికే ఓటేసే సామాన్యుడు.
– ఆర్.ఎం