తులసి సంగ్రహణ విధానం

భగవంతుని పూజకోసం తులసిని పోగుచేయడం భక్తుని ప్రథమ కర్తవ్యం. స్నానం చేయకుండా తులసిదళాలను పోగుచేయకూడదు. స్నానం చేసిన తరువాత చేతులను జోడించి, ప్రణామాలు అర్చించి, తగిన మంత్రాలను ఉచ్చరిస్తూ తులసీదళాలను తీసుకోవాలి. ఒక్కొక్క దళంగా కోయాలి. తులసీదళాలను త్రుంచుకొనేటపుడు తులసీదేవికి ఎటువంటి ఆపద, కష్టం కలుగకుండా చూడాలి. చేతివేళ్లగోళ్లను ఉపయోగించి తులసి పత్రాలను త్రుంచకూడదు. తులసికొమ్మలు, రెమ్మలు ఏవీ విరిగిపోకూడదు.

పుష్పాలతో కూడిన తులసీదళాలు, క్రింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్న తులసీదళాలు, పసుపువర్ణం కలిగిన తులసీదళాలను తీసుకోవాలి. లేత తులసీదళాలను ఏరకూడదు. పూలు వికసించినవెంటనే వాటిని త్రుంచి భగవంతుని పాదాలకు సమర్పించాలి. అవి విత్తనాలుగా మారనివ్వకూడదు, ఎందుకంటే విత్తనాలుగా మారడానికి మొక్కశక్తి అధికమోతాదులో ఉపయోగించబడుతుంది. కృష్ణుని సేవ కొరకు ఎక్కువ తులసీదళాలు, పుష్పాలు ఏర్పడడానికి మొక్క శక్తిని ఉపయోగించవచ్చు.

బ్రహ్మవైవర్తపురాణ 2. 21.51-52 లో చెప్పినప్రకారం
“పూర్ణిమ, అమావాస్య, ద్వాదశి, ఆదివారం రోజులలోనూ,సంక్రాంతి నాడు, స్నానానికి పూర్వం నూనె మర్దన చేసుకొన్నప్పుడూ, మధ్యాహ్న సమయంలోనూ, రాత్రియందూ, మధ్యాహ్నం (రెండు సంధ్యల నడుమ కాలం), అపవిత్ర సమయంలో, అపవిత్ర అవస్థలో తులసీదళాలను పోగు చేయడం శ్రీహరి మస్తకాన్ని ఛేదించిన దానితో సమానం” అని స్మృతిశాస్తాలు చెబుతున్నాయి. కాని శ్రీకృష్ణ భక్తగణం కేవలం ద్వాదశి తిథి యందు, రాత్రి సమయంలో తులసిని త్రుంచరాదు. ద్వాదశిరోజు తులసీదళాన్ని త్రుంచితే వ్యక్తి ఆయువు క్షీణిస్తుంది. అంతేకాక అతడు దూషితమైన, నికృష్టమైన పరిస్థితులలో పడిపోతాడు. కావున ఏకాదశి రోజే అధికంగా పోగుచేసుకాని ఉంచుకోవాలి.
కృష్ణ భగవానుడు తులసీదళాలతో అల్లినమాలను ఇష్టపడతాడు.
తులసీదళంపై చందనం పూసి భగవంతుని చరణకమలాలకు సమర్పించడం సర్వశేష్ట మైనఆరాధన.
తులసీదళాలను విమ్ణభగవానుడి పాదాలకు మాత్రమే అర్చించాలి, ఇతర దేవతల పాదాల పై ఉంచకూడదు.

– ఆర్కే

Leave a Reply