– అంతరాష్ట్ర రౌడీల ప్రదర్శనలా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం
– నామినేషన్ కార్యక్రమం లో రౌడీలు కత్తులు కటార్లతో వీరంగం
– రౌడీ కావాలా? సౌమ్యురాలైన బీ ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలవాలా?
– బీహార్లో పోటీ చేస్తున్న ఎం ఐ ఎం జూబ్లీ హిల్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదు?
– ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్
హైదరాబాద్: జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం జరిగింది. అంతరాష్ట్ర రౌడీల ప్రదర్శనలా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం జరిగింది. నామినేషన్ కార్యక్రమం లో రౌడీలు కత్తులు కటార్లతో వీరంగం చేశారు నామినేషన్ కార్యక్రమం రౌడీలతో నిండిపోతే పోలీసులు చోద్యం చూశారు.
నేర చరితులను ఒకే చోట చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇపుడే ఇలా ఉంటే రేపు నవీన్ యాదవ్ గెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. రౌడీ కావాలా? సౌమ్యురాలైన బీ ఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలవాలా? జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. రౌడీ కల్చర్ పోవాలంటే బీ ఆర్ ఎస్ గెలవాలి.
కాంగ్రెస్ అభ్యర్థి కి ఒవైసి మద్దతు ప్రకటించి పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలన ను తప్పు పడుతున్నారు. అజారుద్దీన్ ను ఓడించేందుకు ఎం ఐ ఎం తన అభ్యర్థిని గతం లో దించింది. .ఇపుడు ఎందుకు అభ్యర్థిని దింపలేదు? బీహార్లో పోటీ చేస్తున్న ఎం ఐ ఎం జూబ్లీ హిల్స్ లో ఎందుకు పోటీ చేయడం లేదు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
కేసీఆర్ హయం లోనే జూబ్లీ హిల్స్ అభివృద్ధి జరిగింది .ఒవైసి కి ఆ అభివృద్ధి కనిపించక పోతే మేము ఏం చేస్తాం ? బీజేపీ బీ ఆర్ ఎస్ ల సిద్ధాంతాలు వేర్వేరు?ఎలా కలుస్తాయి ? దొంగ ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చేసే యత్నాలు అడ్డుకుంటాం. కాంగ్రెస్ రౌడీయిజం కు ఓట్లు పడవు
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలను భయబ్రాoతులకు గురి చేస్తున్నారు. కత్తులు కటార్లతో ప్రదర్శనలు ఏమిటి ? ప్రచారానికి వెళ్తున్న మా కార్యకర్తలను నవీన్ మనుషులు బెదిరిస్తున్నారు. ఎన్నికల కమిషన్, పోలీసుల తీరు మారాలి. సీఎం గన్ కల్చర్ ను ప్రోత్సహిస్తుంటే, కాంగ్రెస్ అభ్యర్థి కత్తులతో వీరంగం చేయరా ? అధికారం ఉంది కదా ఏమి చేసినా చెల్లుతుందంటే కుదరదు.. సినిమా లో విలన్ల ను చూసాం .ఈ రోజు మళ్ళీ నామినేషన్ల ఘట్టం లో మళ్ళీ వాళ్ళను చూసాం.
ట్రాఫిక్ కు గంటల తరబడి అంతరాయం కలిగినా పోలీసులు పట్టించుకోలేదు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. బీ ఆర్ ఎస్ కచ్చితంగా జూబ్లీ హిల్స్ లో గెలుస్తుంది. ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే ఎన్ .భాస్కర్ రావు , బీ ఆర్ ఎస్ నేతలు ప్రశాంత్ కుమార్ రెడ్డి , తోట ఆగయ్య పాల్గొన్నారు