Suryaa.co.in

Food & Health

పొన్నగంటి కూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలేంటి?

పొన్నగంటి కూరను ఉడికించి, మిరియాల పొడి చేర్చి తీసుకుంటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదే కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు.
ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో, పీల్చుకునే గాలిలో రసాయనాలు ఉండటంతో అవి రక్తంతో కలిసిపోతున్నాయి.తద్వారా రక్తం అశుభ్రమైపోతుంది.రక్తాన్ని శుద్ధి చేయాలంటే.. శుభ్రం చేసిన పొన్నగంటి ఆకును కట్ చేసి.. పెసరపప్పు, చిన్న ఉల్లి పాయలు, జీలకర్ర, వెల్లుల్లి, మిరియాల పొడి చేర్చి ఉడికించి తీసుకుంటే సరిపోతుంది.
శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. ఎక్కువ ఎండల్లో తిరిగి పనిచేసే వారికి, గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. కంటి సమస్యలు ఏర్పడుతాయి.
అలాంటి సమస్యలు ఎదురైతే.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇంకా ఈ ఆకుకూర నోటి దుర్వాసనను పోగొడుతుంది. గుండెకు మెదడుకు ఉత్సాహాన్నిస్తుంది.

LEAVE A RESPONSE