హైదరాబాద్ అన్నలను ఖుషీ చేస్తిరి.. మాకెప్పుడిస్తారు 250 గజాలు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హైదరాబాద్ జర్నలిస్టుల కోసం 2 చోట్ల 70 పైచిలుకు ఎకరాల్లో ఇచ్చిన భూములను హక్కు భుక్తం చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రమణ గారు మేలు చేయడం సంతోషకరం..దీర్ఘకాలిక సమస్యకు ప్రభుత్వ చొరవతో మేలు జరుగుతుంది..దీని వల్ల హైదరాబాద్ లోని1250 మంది జర్నలిస్టులకు ప్రయోజనం చేకూరింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ని ఒప్పించి మెప్పించిన అల్లం నారాయణ సర్,క్రాంతన్న అదే చొరవను ప్రదర్శించి జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు 250 గజాల చొప్పున స్థలాలను కేటాయించే GO ను తెచ్చి వేలాది మంది గ్రామీణ విలేకరుల బతుకుల్లో వెలుగులు తేవాలని కోరుకుందాం.

ఎందుకంటే మంత్రులు,ఎమ్మెల్యేలు ఇతర నేతల వద్ద మస్కా పాలిష్ చేస్తే పలు చోట్ల డబుల్ బెడ్రూమ్ లు వచ్చాయి..అవికూడా నాసిరకంగా ఉండడం వల్ల మున్ముందు ఎక్కట్లే తప్పదు..అలాంటి ఇండ్లు తెలంగాణలో చిన్న సగం మంది జర్నలిస్టులకు కూడా దక్కలేవు..నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పని చేస్తున్న వారిలో కొందరికి వినాయక్ నగర్లో 50-60 గజల జాగను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.. నాగరంలో ఇచ్చిన జాగలు కబ్జాకు గురైనా పట్టించుకునే నాధుడు లేడు.. వీరే కాకుండా జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న బ్యూరో ఇంఛార్జీలు,స్టాఫ్ రిపోర్టర్లు,డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వలేదు.

కామారెడ్డి,ఎల్లారెడ్డి, మద్నూర్, జుక్కల్, బిచ్కుంద తదితర ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు లేక కిరాయి కొంపల్లోనే బతుకులు ఎల్లదిస్తున్నారు మన జర్నలిస్టులు.. తెలంగాణ అంతటా పరిస్తితులేమి భిన్నంగా లేవు..కాబట్టి హైదరాబాద్ జర్నలిస్ట్ లకు ఇచ్చిన విధంగానే జిల్లా, డివిజన్,మండల కేంద్రాల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు 250 గజాలు కేటాయిస్తూ..ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలకు తగ్గకుండా ఆర్థిక సహాయం అందచేసే విధంగా ప్రభుత్వం తో చర్చించి GO తెచ్చి గ్రామీణ జర్నలిస్టుల గుండెల్లో కొలువు దీరాలని అల్లం సర్ ను మనసారా కోరుకుంటూ..

-జమాల్పూర్ గణేష్.

Leave a Reply