మిగిలిన కేసులలో ఏదీ ఆ ‘చైతన్య’ం?

0
20

-చైతన్య కాలేజీ పై చర్యలు రైటే..
-ఫిర్యాదు చేయకపోయినా సర్కారు స్పందన
-ఆ కాలేజీకి ఇంటర్ బోర్డు నోటీసులు
-మరి ఎంపీ మాధవ్ కేసులో అది వర్తించదా?
-జడ్జిలను విమర్శించిన వారి అరెస్టులేవీ?
-టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన ఫిర్యాదుపై మరి చర్యలేవీ?
-‘లా’ ఒక్కింయు లేదా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

బెజవాడ చైతన్య కాలేజీలో చదివే ఓ విద్యార్ధిపై, టీచరు కీచకుడి అవతారమెత్తాడు. ఆ విద్యార్ధి చెంపలు పగలకొట్టడమే కాకుండా, కాలితో తన్నాడు. ఆ దృశ్యాలన్నీ సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. అది తెలుసుకున్న ‘ఎర్రజెండా పిల్లలు’ ధర్నాకు దిగి, చైతన్య కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గళమెత్తాయి. అంతే. సర్కారు ఆగమేఘాలపై స్పందించి, సదరు చైతన్యకాలేజీ యాజమాన్యానికి నోటీసులిచ్చింది. మీ కాలేజీ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదురోజుల్లో చెప్పాలని, రంగంలోకి దిగిన ఇంటర్‌బోర్డు తాఖీదులు పంపింది. దాడి చేసిన లెక్చరర్‌పై తగిన చర్యలు తీసుకుంటామని ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ కృష్ణారావు ప్రకటించారు.
– లక్షలు పోసి చదువు‘కొంటున్న’ సదరు చిరంజీవిపై ..అన్నే లక్షలు ప్యాకేజీగా జీతం తీసుకుని, చావగొట్టి చెవులుమూసి చదువు చెప్పే సదరు టీచరు దాష్టీకానికి సంబంధించి.. ఏపీలో జగనన్న సర్కారు వాయువేగంతో తీసుకున్న నిర్ణయమిది.

జగనన్న సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎవరైనా స్వాగతించి, అభినందించాల్సిందే. దంపేసి దండమెట్టాల్సిందే. చదువు చెప్పాల్సిన టీచరు మదమెక్కి, ఒళ్లు బలిసి చేసిన చేష్టలను సభ్య సమాజం స్వాగతించదు. బుద్ధి ఉన్న ఎవరైనా సదరు కీచక మాస్టారికి తగిన శిక్ష వేయడం ద్వారా.. నాలుగు గోడల మధ్య అదే దాదాగిరి చేస్తున్న మిగిలిన కార్పొరేట్ కాలేజీ- స్కూళ్ల టీచర్లకు- ర్యాంకుల కోసం విద్యార్ధులను బలిపీఠమెక్కిస్తున్న యాజమాన్యాలకు ఒక హెచ్చరిక సంకేతం పంపాలని కోరుకుంటారు. ఈ విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయం మెచ్చదగినదే. అభినందనలకు జగనన్న నూరుశాతం అర్హుడు కూడా!

ఇక్కడ పాలకులను మెచ్చుకోవలసింది మరొకటి కూడా ఉంది. మాస్టారు చేతిలో చావుదెబ్బలు తిన్న చిరంజీవి గానీ, అతని తండ్రి గానీ ఇప్పటిదాకా ఏ పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అలాగే ఇంటర్‌బోర్డుకూ ఫిర్యాదు చేసి, కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఫిర్యాదు చేసినట్లు ఇప్పటిదాకా కనిపించలేదు. మీడియాలో అది రిపోర్టు అయినట్లు లేదు. కానీ, ధర్మం దారి తప్పకుండా, దానిని దగ్గరుండి చేతులు పట్టుకుని మరీ.. నాలుగుపాదాలా జాగ్రత్తగా నడిపిస్తున్న జగనన్న సర్కారు.. విద్యారంగంపై తనకున్న అచెంచల విశ్వాసం, గౌరవంతో ఆ కేసును సుమోటోగా తీసుకుని, తానే స్వయంగా చర్యలకు దిగింది. చట్టం, ధర్మాన్ని ఎలా కాపాడాలో-ఎలా వాడాలో దేశంలో బహుశా.. జగనన్న సర్కారుకు తెలిసింతగా మరెవరికీ తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, చైతన్య కాలేజీపై చర్యల కొరడా ఝళిపించింది. అంతా బాగానే ఉంది. చర్యలన్నీ బహు భేషుగ్గానే ఉన్నాయి. ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, చట్టాన్ని లెక్కచేయకుండా మరీ తనంతట తాను చర్యల కొరడా ఝళిపించిన జగనన్న సర్కారు అందరి శహభాషులందుకుంది.

మరి ఇదే ఉత్సాహం.. ఇదే తపన.. ఇదే న్యాయం మిగిలిన కేసులలో .. ఇంత ‘చైతన్య’ంగా ఎందుకు వెళ్లడం లేదన్నది బుద్ధిజీవుల ప్రశ్న. దీనికి సంబంధించి ఇప్పటివరకూ ఏపీలో జరిగిన కొన్ని ఘటనలను ముచ్చటించుకుందాం. తస్మదీయుడయిన చైతన్య కాలేజీ వ్యవహారంలోనే జగనన్న సర్కారు ఎందుకు చైతన్యంగా వ్యవహరించింది? మిగిలిన కేసుల్లో ఎందుకు చైనత్యరహితంగా ఉంటోందన్నది అది చదివిన తర్వాత తెరపైకొచ్చే చట్ట- ధర్మ సందేహం.

వైసీపీ ఎంపీ మాధవ్ తన ‘విశ్వరూపం’ ప్రదర్శించి.. నిఖిల లోకాన్ని నివ్వెరపరిచిన విశ్వవ్యాపితమైన ఘటనకు సంబంధించి, మహిళా లోకం ఎంత మొత్తుకున్నా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరాఖరకు మహిళా నేతలు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిసినా ఆయనపై ఆంధ్రాలో చర్యలు శూన్యం. పైగా ఆయన తరఫున ‘మాధవాభిమానులు’ ఇచ్చిన ఫిర్యాదుపైనే కేసు కట్టారు. మరి ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదంటే.. నీతి నిజాయితీకి నిలువుటద్దమైన అనంతపురం జిల్లా ఎస్పీ గారు ఏం చెప్పారంటే.. ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు కట్టలేదని సెలవిచ్చారు. మరి నిజమే కదా? ఏదైనా సంఘటనలకు సంబంధించి, ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేయాలి. లేదా పోలీసులే సుమోటోగా కేసులు పెట్టాలి.

మరి ఆ ప్రకారం పాలకుల వాదన నిజమే అయితే… చైతన్య కాలేజీ అమానవీయ ఘటనకు సంబంధించి, బాధితుడు గానీ అతని తండ్రి గానీ ఎలాంటి ఫిర్యాదు చేయనప్పుడు.. ప్రభుత్వం ఏవిధంగా చర్యలు తీసుకుంటుంది? తనని కొట్టారని దెబ్బలు తిన్న విద్యార్ధి ఏ పోలీసుస్టేషన్‌కు గానీ, విద్యాశాఖాధికారికి గానీ ఫిర్యాదు చేయలేదు. పోనీ బయటకొచ్చి, తనను మాస్టారు రప్ఫాడించారని మీడియా గొట్టాల ముందు ఏకరవు పెట్టలేదు. మరి ఏ చట్టం ప్రకారం సర్కారు, ఆ కాలేజీకి నోటీసులిచ్చిందన్నది బుద్ధి జీవుల సందేహం.

చైతన్య లొల్లిని కాసేపు పక్కనపెడదాం. డీజీపీ ఆఫీసుకు కూతవేటులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై వైసీపీ దుండగులు దాడిచేసిన ఘటన.. ఏపీలో పోలీసుల ప్రతిభాపాటవాలు, శక్తిసామర్ధ్యం, ముందుచూపు, నిఘా పనితనాన్ని దేశానికి చాటాయి. దుండగులు సీమ సినిమాల్లో జీపులెక్కి కర్రలు, రాడ్లను తిప్పుకుంటూTDPoffice-Attack-Andhra-191021-1200 టీడీపీ ఆఫీసులోకి దూసుకువెళ్లి, ఆఫీసులో విధ్వంసం సృష్టించి ఇప్పటికి 11 నెలలయిపోయింది. మా పార్టీ ఆఫీసుపై దాడి చేసిన గూండాలను పట్టుకున్నారా అంటూ పోలీసు మాజీ ఆఫీసరయిన వర్ల రామయ్య స్వయంగా పోలీసుస్టేషన్‌కు వె ళ్లి, వాకబు చేయాల్సిన దుస్థితి. పోనీ.. ఆ ఘటనకు సంబంధించి ఎంపీ మాధవ్ వ్యవహారం మాదిరిగా, ఫిర్యాదులేమైనా రాలేదా అంటే ఎప్పుడో వచ్చింది. మరి ఇప్పటివరకూ దానిపై ఎలాంటి చర్యలూ లేవు. అంటే.. ఫిర్యాదు ఇచ్చిన టీడీపీ ఆఫీసుపై దాడికే దిక్కు లేదు. కానీ ఫిర్యాదు చేయని విద్యార్ధి కేసుకు సంబంధించి మాత్రం, తనంతట తాను చర్యలు తీసుకుంది. విచిత్రంగా లేదూ?!

ఇంకో ఘటన చూద్దాం. జగనన్న సర్కారు నిబంధనలకు విరుద్ధంగా తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులిస్తున్న హైకోర్టు జడ్జిలపై, జగనన్న ఆత్మాహుతిదళాలు సోషల్ మీడియాలో శివమెత్తాయి. వారి నిర్ణయాలను విమర్శిస్తూ పోస్టింగులు పెడితే, స్వయంగా హైకోర్టు అధికారే సీఐడీకి ఫిర్యాదు చేశారు. అయితే.. ‘అంతకుమించి’న ముఖ్యమైన సేవల్లో సీఐడీకి తీరిక లేకపోవడం వల్ల, కోర్టు కేసును సీబీఐకి అప్పగించిదనుకోండి. అది వేరే విషయం. మరి స్వయంగా హైకోర్టు అధికారి చేసిన ఫిర్యాదునే పట్టించుకోని సర్కారు.. ఎలాంటి ఫిర్యాదు లేని చైతన్య కేసుపై, యమా స్పీడుగా స్పందించడమే ఇంకో ఇసిత్రం!

మరో ఘటన చూద్దాం. చంద్రబాబునాయుడు, లోకేష్‌పై వైసీపీ సోషల్‌మీడియా దళాలు చేస్తున్న దాడులపై.. టీడీపీ నేతలు పలు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. డీజీపీకీ ఫిర్యాదు చేశారు. అంతకంటే ముందు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై ‘గుర్తు తెలియని’ దుండగులు దాడి చేసి, ఇంటిని,pattabhi కారును ధ్వంసం చేశారు. దానిపై ఫిర్యాదు కూడా చేశారు. అయినా ఇప్పటిదాకా చర్యలకు దిక్కులేదు. తాజాగా చంద్రబాబు కుప్పం పర్యటనపై వైసీపీ నేతల ఉత్సాహాన్ని సోషల్‌మీడియాలో అంతా చూశారు.
ఇంకో ఆశ్చర్యమైన ఘటన చూద్దాం. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ .. రాష్ట్రంలో చాలాచోట్ల తెలుగు తమ్ముళ్లపై కేసులు పెట్టి, వారిని జైలుకు పంపించింది. అయితే.. అదే విధినిర్వహణలోBJPSomu-Veerraju ఉన్న, అదే పోలీసు అధికారిపై జులుం చేసిన, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే హాశ్చర్యం.