Suryaa.co.in

Features

ఢిల్లీకి వచ్చేందుకు నా దగ్గర డబ్బుల్లేవు.. ఆ పద్మశ్రీ అవార్డును పోస్టులో పంపండి!

‘హాల్దార్ నాగ్’ పేరు ముందు ఇప్పటి వరకు ఎవ్వరూ శ్రీ పెట్టి పిలువలేదు..
మూడు జతల బట్టలు, ఊడ తెగిన రబ్బరు చెప్పులు, ఒక కాడలు లేని కండ్లజోడు, జీవితంలో 732 రూపాయలు జమ చేసుకున్న గ్రామీణ భారతీయుడు పద్మశ్రీ పురస్కారం కొరకు ఎంపిక కాబడ్డాడు..
చరిత్రలో పద్మశ్రీ పురస్కారం కొరకు ఎంపిక కాబడిన అత్యంత పేదవాడు..!!
వీరే కోస్లీ భాష సుప్రసిద్ధ కవి, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన హాల్ధార్ నాగ్. చెప్పుకోదగ్గ విషయమేమంటే వీరు ఇప్పటి వరకు రచించిన కవితలు, 20 మహాకావ్యాలు అన్ని వీరి నాలుకపై ఉంటాయి. ఇప్పుడు వీరి రచనా సంకలనం ‘హల్ధర్ గ్రంథావళి’ సంబల్పూర్ విశ్వవిద్యాలయంలో పాఠ్యఅంశము..
సాదా-సీదా కట్టుబొట్టు, తెల్లని ధోవతి-బనీను ధరించే నాగ్ గారు చెప్పులు లేకుండానే తిరుగుతారు. ఇలాంటి వజ్రాన్ని కేంద్ర ప్రభుత్వం వెతికి పట్టుకుంది..
ఒడియా భాష జానపద కవి గురించి తెలుసుకుంటే ప్రేరణతో ఉబ్బి-తబ్బిబ్బు అవుతారు. గ్రామీణ ‘దళిత కుటుంబంలో ‘ జన్మించిన హాల్ధర్ 10వ ఏట తల్లి-దండ్రులను కోల్పోయాడు.
3వ తరగతిలోనే చదువు ఆగిపోయింది. అనాధగా బతుకుతూ డాబా హోటళ్లలో ఎంగిలి ప్లేట్లు కడిగి ఆకలి తీర్చుకునేవారు. తర్వాత ఒక స్కూల్‌లో వంట మనిషి పని దొరికింది..
కొన్ని సంవత్సరాల తర్వాత బ్యాంకు నుండి 1000 రూపాయలు అప్పు తీసుకొని కాపీలు-పెన్నులు-పెన్సిల్లు ఆమ్ముకోడానికి ఒక డబ్బా దుకాణం స్కూల్ ముందు పెట్టుకున్నారు. ఇది వారి ఆర్థిక స్థితి..
వీరి సాహిత్య సేవల గురించి చెప్పుకుంటే 1995 కాలంలో స్థానిక ఒడియా భాష కోస్లీలో ‘రాం-శబరీ’ పేరుతో కవిత్వాలు వ్రాసి-వ్రాసి ప్రజలకు వినిపించే వారు. భావయుక్త కవిత్వాలను ప్రజలు ఎంతో మెచ్చుకునే వారు. అలా ప్రసిద్ధి చెందిన హల్ధర్ నాగ్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీపురస్కారం సాదా-సీదా వేషధారణలో అందుకున్నారు..
వీరు చదివింది మూడవ తరగతే.. !
అయినా ఆయన రచనలపై విశ్వవిద్యాలయంలో 5 గురు విద్యార్థులు PHD చేసి డాక్టరేట్ పొందారు..

– అక్కినేని ప్రసాద్

LEAVE A RESPONSE