Suryaa.co.in

Andhra Pradesh Crime News

అస్లాం ఫోరెన్సిక్ నివేదిక ఎక్కడ?

– క్రిందటి నెలే నివేదిక అందజేసామంటున్న ఫోరెన్సిక్ అధికారులు
– అధికారులు లేరని సాకులు చెబుతున్న ఏసిపి
భవానిపురం పోలీస్ స్టేషన్ కు మార్చి 7వ తేదీన సాయంత్రం వచ్చిన అన్వర్, అస్లాం మొదటి భార్య
-గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బంధువుల ఆరోపణలు

విజయవాడ: అస్లాం మృతి ఘటనలో తొలినుంచి అనేక అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తునే ఉన్నారు.ఈ వ్యవహారంపై రాజకీయపక్షాలు, మైనారిటీ నేతలు ఆందోళన చేపట్టారు. తాజాగా అస్లాం మృతికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికను గత నెలలోనే కొత్తపేట పోలీసులకు అందజేశామని, ఫోరెన్సిక్ అధికారులు స్పష్టం చేశారని, అస్లాం బంధువులు పేర్కొన్నారు.

అస్లాం మృతి ఘటనలో న్యాయం చేయాలని ఫోరెన్సిక్ నివేదిక గురించి వివరాలు వెల్లడించాలని, విజయవాడపశ్చిమ ఏ సి పి హనుమంతరావు ను అస్లాం బంధువులు కలవడం జరిగింది. అయితే కొత్తపేట పోలీస్ అధికారులు సెలవులో ఉన్నారని, ఫోరెన్సిక్ నివేదిక సంబంధించిన రికార్డులను లాకర్లో పెట్టి తాళం వేసుకొని వెళ్లడంతో ఆ నివేదికలో ఏముందో తెలీదని ఏసీపీ పేర్కొన్నారని. ఏసీపీ కుంటిసాకులు చెబుతున్నారని, బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇక్కడే తమకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. విజయవాడ నగరంలో సంచలనంగా మారిన అస్లాం మృతి ఘటన పై వాస్తవాలు వెలికితీసే క్రమంలో కొంతమంది పక్కదారి పట్టించే, ప్రయత్నం జరుగుతోందని, ఇందులో కొందరు పోలీసుల తీరును బంధువులు తప్పుపడుతున్నారు.

అస్లాం మృతి లో అనేక అనుమానాలు ఉన్నాయని, వించిపేటే కాదు విజయవాడ నగరం అంతా కోడై కూస్తున్నప్పటికీ, కొంతమంది పోలీస్ అధికారులు, ఈ వ్యవహారంలో భారీగా తమ వాటాన్ని చూపించారని అస్లాం బంధువులు ధ్వజమెత్తారు. వారంతా ఫోరెన్సిక్ నివేదికలను సైతం బయటకు ఇవ్వకుండా, 15 రోజుల నుంచి వివరాలు తెలియజేయకుండా గోప్యంగా ఉంచు తున్నతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

అస్లాం మృతి ఘటనలో తాము న్యాయపోరాటం చేస్తామని, కొంతమంది పోలీస్ అధికారుల వాటాన్ని ప్రదర్శించే తీరు త్వరలోనే బయటపెడతామని. న్యాయాన్ని ఎవరూ పూడ్చలేరని, ధర్మం గెలుస్తుందని, , నమ్ముకున్న దేవుడే తమకు న్యాయం చేస్తాడని, ఎంతటి శక్తి నైనా దేవుడు ముందు తల వంచాల్సిందే నని అస్లాం బంధువులు ధ్వజమెత్తారు.

LEAVE A RESPONSE