Suryaa.co.in

Andhra Pradesh

పరిశుభ్రత ఎక్కడ ఉంటే అక్కడే ఆరోగ్యం

– డేవిడ్ పేటలో భారీ మానవహారం.. చీపురు పట్టి చెత్తను తొలగించిన ఎంపీ వేమిరెడ్డి
– స్థానిక మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఎంపీ

ఇందుకూరుపేట: వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌ సందర్భంగా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట లో అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ముందుగా స్థానికంగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన ఎంపీ వేమిరెడ్డి.. ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం భారీ మానవ హారంగా ఏర్పడి పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారాన్ని రాష్ట ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ రోజుగా ప్రకటించిందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగస్వాములు అయి ప్రతి ఒక్కరు పరిశుభ్రత కోసం పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. దైనందిన జీవితంలో స్వచ్ఛతను ఒక అలవాటుగా మార్చుకోవాలని ఎంపి ప్రభాకర్ రెడ్డి సూచించారు.

గ్రామస్థులు బహిరంగ బహిర్భూమికి వెళ్లకుండా మరుగుదొడ్లను ఉపయోగించుకోవాలన్నారు. మరుగుదొడ్లు లేనివారికి అధికారులు త్వరితగతిన చర్యలు చేపట్టి నిర్మించుకునేలా చూడాలన్నారు. అనంతరం పాగావారిపాలెం గిరిజన కాలనీలో నిర్వహించిన ఎన్‌టీఆర్‌ వర్థంతి కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి పాల్గొని ఎన్‌టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు వీరేంద్ర నాయుడు, దువ్వూరు కల్యాణ్‌ రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, కోడూరు కమలాకర్‌రెడ్డి, బెజవాడ వంశీ రెడ్డి, గుడి హరిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు, భారీ స్థాయిలో మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE