Suryaa.co.in

Andhra Pradesh

హు కిల్డ్ బాబాయి.. జగన్ రెడ్డి?

-సొంత జిల్లాకు జగన్ చేసిందేంటి? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి
-వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం
-జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది
-విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు
– నారా చంద్రబాబు నాయుడు

ఐదేళ్ల పాలనలో సొంత జిల్లాకు, రాయలసీమకు సీఎం జగన్ రెడ్డి చేసిందేంటని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిలదీశారు. ఉమ్మడి కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన రా..కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ…..“ ‘రా…కదలిరా’ అని పిలుపిస్తే కమలాపురం కాలుదువ్వింది. కడపలో గడపగడపా యుద్ధానికి సిద్ధమంటోంది. ఈ ఘట్టాన్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటాను. కమలాపురం సభకు వచ్చిన జనమంతా నేను చేస్తున్న పోరాటం నా స్వార్థం కోసం కాదని తెలుసుకోవాలి. రాష్ట్రంలోని యువత, రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారి సంతోషం, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. మీ సహకారం లేకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నా ఒక్కడి చేతుల్లో ఉండదు.

2019లో కడపలో అన్నిసీట్లలో వైసీపీనే గెలిపించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కరికైనా న్యాయం జరిగిందా? మీ ఆదాయం పెరిగిందా.. మీకు ఉద్యోగాలు వచ్చాయా? సాగు..తాగునీరు అందిందా? రైతుల జీవితాలు సంతోషంగా ఉన్నాయా? మహిళలు సంతోషంగా ఉన్నారా? కడప జిల్లాలో ఒక్కడే ఒక్కడికి న్యాయం జరిగింది. ఆ ఒక్కడు జగన్ రెడ్డి. అతనితోపాటు మరో ఇద్దరు, ముగ్గురు బాగుపడ్డారు. జగన్ రెడ్డి మాటలు కోటలు దాటాయిగానీ, చేతలు గడపకూడా దాటలేదు. కమలాపురంలోనే ఈ స్థాయిలో స్పందన ఉంటే, వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ గెలవడం ఖాయం.

ఇన్నిసార్లు గెలిపించాం.. మాకు ఏం ఒరగబెట్టావని జగన్ రెడ్డిని కడపవాసులే నిలదీస్తున్నారు. పులివెందుల ప్రజలు ఇలాంటివాడినా తాము గెలిపించింది అని బాధపడుతున్నారు. కడపజిల్లాలో కరువు వచ్చి, 35 మండలాలు తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం జిల్లాలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ ముఖ్యమంత్రి ఒక్క మండలాన్ని అయినా కరువు మండలంగా ప్రకటించాడా? అధికారులు చెబితే నా జిల్లాలో కరువు రావడం ఏమిటన్న అహంకారంతో ఫైళ్లు విసిరి వారి ముఖాన కొట్టాడు. అదే అధికారంలో నేను ఉండి ఉంటే, కరువు నివారణ చర్యలు చేపట్టేవాడిని. కేంద్రాన్ని ఒప్పించి నిధులు తీసుకొచ్చి, రైతాంగాన్ని ఆదుకునేవాడిని. ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు. కథలు చెప్పాడు.. ముద్దులు పెట్టాడు. చివరకు ఇప్పుడు గుద్దులు గుద్దుతున్నాడు.

కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా…హు కిల్డ్ బాబాయి?
హూ కిల్డ్ బాబాయ్ తమ్ముళ్లూ? ఈ స్టోరీ టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని కూడా మరిపిస్తుంది. మలుపుల మీద మలుపులు.. సస్పెన్సన్స్ ల మీద సస్పెన్స్ లు. వివేకా హత్యపై గుండెపోటు అంటూ, రక్తపు వాంతులు అంటూ సాక్షిలో తప్పుడు ప్రచారం చేశారు. పోస్టుమార్టంలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు తండ్రి లేడు, బాబాయి లేడు అంటూ గత ఎన్నికల్లో ఓట్లు అడిగిన జగన్ రెడ్డికి నేడు వివేకా హత్యపై సమాధానం చెప్పే ధైర్యం ఉందా? నాడు సీబీఐ కావాలని కోర్టుకెళ్లారు, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణ వద్దన్నారు.

అసలు వివేకా హత్యపై మాట్లొద్దంటూ గ్యాగ్ ఆర్దర్ తెచ్చారు. వివేకాకు రెండో భార్య వ్యవహారం, బెంగుళూరు ఆస్తులు వల్లే హత్య అంటూ చెప్పారు. తర్వాత కూతురు సునీత, ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేశారు. ఏ తప్పు చేయని కోడికత్తి శ్రీను జైల్లో ఉన్నాడు బాబాయిని చంపిన అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరుగుతున్నాడు. దోషులు అరెస్ట్ కాకుండా నిర్దోషులు అరెస్ట్ అవుతున్నారు. కడప గడ్డపై నిలబడి అడుగుతున్నా…హు కిల్డ్ బాబాయి దీనికి జగన్ సమాధానం చెప్పాలి?

వైసీపీ పాలనలో బాదుడే బాదుడు
వైసీపీ పాలనలో నిత్యావసర ధరలన్నీ పెరిగాయి. టీడీపీ హయాంలో సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు ఇచ్చాం. పెళ్లికానుక, విదేశీ విద్య వంటి సంక్షేమ పధకాలు నేడు ఉన్నాయా? రేషన్ షాపుల్లో 18 రకాల వస్తువులు ఇచ్చాం. నేడు పేదల్ని పట్టించుకుంటున్నారా? జగన్ రెడ్డిది బటన్ నొక్కుడు కాదు, బటన్ బొక్కుడు. ఇసుక నుంచి తైలం తీయగల సమర్ధులు వైసీపీ నేతలు. పెన్నా నది నుంచి ఇసుక దొంగ రవాణా చేస్తున్నారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి జగన్ రెడ్డి తన పొట్ట నింపుకుంటున్నాడు.

నాడు నాణ్యమైన మద్యం రూ. 60 కి విక్రయిస్తే నేడు నాసిరకం మద్యం రూ. 250 కి విక్రయిస్తున్నారు. ఈ డబ్బంతా జలగన్నకు పోతుంది. నాసిరకం మద్యంతో పేదల ఆరోగ్యం గుళ్లవుతోంది. మద్యపాన నిషేదం అని చెప్పి మద్యంపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ. 36 వేల కోట్లు అప్పు తెచ్చారు. పెట్రోల్, డీజీల్, ఆర్టీసీ రేట్లు అన్ని రేట్లు పెంచారు. ఆస్తిపన్ను, నీటి పన్ను చివరకు చెత్తపై కూడా పన్ను వేశారు. కరెంట్ చార్జీలు 9 సార్లు పెంచారు. విద్యుత్ సంస్కరణలు తెచ్చిన ఘనత టీడీపీదే. 1998లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ ని 10 వేల మెగావాట్లకు పెంచాను. 2014లో 22 మిలియన్ యూనిట్ల కొరత ఉంటే 100 రోజుల్లో కరెంట్ కొరత లేకుండా చేశాం. 5 ఏళ్లలో ఒక్కసారి కరెంట్ చార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అప్పుల కోసం రైతుల మోటార్లకు మీటార్లు పెట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ చార్జీలు పెంచం.

రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి
కడప స్టీల్ ఫాక్టరీకి రెండు సార్లు రిబ్బన్ కట్ చేశారు ఏమైంది? రిబ్బన్లు కట్ చేయటం రంగులు వేసుకోవటం తప్ప జగన్ రెడ్డి చేసిందేమీ లేదు. నేను రాయలసీమ బిడ్డనే..రాయలసీమకు మొదటిసారిగా నీళ్లిచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగను తవ్విన వ్యక్తి ఎన్టీఆర్. 2014- 19 లో రూ. 12,500 కోట్లు ఒక్క కడప జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసి ప్రాజెక్టులను పరిగెత్తించాం. గండికోట ద్వారా పులివెందులకు నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే. మేం ఖర్చు చేసిన దానిలో కనీసం 20 శాతమైనా జగన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఖర్చు చేశారా?

ఎక్కడైనా ఒక్క పిల్ల కాలువ తవ్వారా? రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి. పట్టిసీమ ద్వారా 120 టీఎంసీలు రాయలసీమకు ఇచ్చాం. దాని వల్ల అన్ని కాలువల్లో నీళ్లొచ్చాయి. కానీ నేడు రైతుల కళ్లలో నీళ్లు పారుతున్నాయి. గోదావరి నీళ్లు బనకచర్లకు తెచ్చి..రాయలసీమను రతనాల సీమ చేస్తా.. నీళ్లుంటే పరిశ్రమలు వస్తాయి, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. హార్టికల్చర్ హబ్ గా మారుతుంది. నాడు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. రూ. 4 వేల కోట్లతో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు ఇచ్చాం. నేడు అవి ఏమయ్యాయి? వచ్చేది రైతు రాజ్యమే.

కులం కూడు పెట్టదు..సమర్దవంతమైన పాలనతోనే ప్రజల జీవితాల్లో మార్పు
వైసీపీ పాలనలో అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు నష్టపోయాయి. కడపలో రెడ్లు ఎవరికైనా న్యాయం జరిగిందా. పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి కి తప్ప మిగతా ఎవరికైనా న్యాయం జరిగిందా? యువతకు ఉద్యోగాలొచ్చాయా? రైతులకు న్యాయం జరిగిందా? కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవటంతో 43 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో సగం మంది రెడ్లే. కులం, మతం మనకు మంచి చేయదు. సమర్ధవంతమైన పాలనే ప్రజల జీవితాలకు మార్గం చూపుతుంది. సామాజిక న్యాయం అంటూ జగన్ రెడ్డి ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతిపై పోరాటం చేసినందుకు ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యను హత్య చేశారు. రేపల్లెలే అమర్నాధ్ గౌడ్ అనే విద్యార్దిని పెట్రోల్ పోసి కాల్చి చంపారు.

కాకినాడలో దళిత డ్రైవర్ సుబ్రమణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. నంద్యాలలో పోలీసుల వేధింపులతో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఇదేనా సామాజిక న్యాయం?బాధితుల కుటుంబాలను జగన్ ఎప్పుడైనా పరామర్శించారా? 29 మంది దళిత ఎమ్మెల్యేలను జగన్ ట్రాన్స్ పర్ చేశారు. భూకబ్జాలకు జగన్ రెడ్డి లైసెన్స్ లు ఇచ్చారు. బాధితులకు న్యాయం చేయకుండా కబ్జా చేసిన వారికి న్యాయం చేస్తారు. జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ల పేర్ల మీద ఎక్కిస్తున్నారు.

దీనికి భూరక్షణ చట్టం అంటూ కొత్తగా చట్టం తెచ్చారు. అది అమల్లోకి వస్తే మీ భూములు గోవిందా? టీడీపీ అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. 5 ఏళ్ల నుంచి ఒక్క ఎమ్మెల్యేని మందలించకుండా ఇప్పుడు వేరే నియోజకవర్గాలకు ట్రాన్స్ పర్ చేస్తున్నారు. మీ ఊరిలో చెత్త మరో ఊర్లో బంగారం అవుతుందా? సొంత చెల్లికి న్యాయం చేయలేని వాడు మీకు న్యాయం చేస్తాడా? జగనన్న బాణం రివర్స్ గేర్ లో వస్తోంది. విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు.

బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ
ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది మహిళలుంటే వారికి నెలకు రూ. 1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది విద్యార్దులున్నా ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. యువగళం నిధి కింద నెలకు రూ. 3 వేలు యువతకు నిరుద్యోగ భృతి, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. యువత సైకిలెక్కి టీడీపీ జనసేన జెండా పట్టి ప్రజలను చైతన్యం చేయాలి. అన్నధాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.

సబ్సిడీకీ డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తాం. కుళాయిలా ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరిస్తాం. పి 4 తో పేదల్ని ధనికులుగా చేస్తాం. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచుతాం. బీసీలకు రక్షణ చట్టం తెస్తాం. అన్నా క్యాంటీన్లు పెడతాం. ఒంటిమిట్ట కోదండరాముని ఆలయం నేనే అభివృద్ది చేశా. మైనార్టీలకు రూ. 25 కోట్లతో 90 శాతం హజ్ హౌస్ నిర్మాణం చేశాం, కానీ మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేని జగన్ 3 రాజధానులు కడతాడట. 3 రాజధానులు పేరుతో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. కర్నూలు లో హైకోర్టు బెంచ్ పెడతాం, విశాఖతో పాటు కడప , కర్నూలు అనంతపురం అన్ని జిల్లాలు అభివృద్ది చేస్తాం.

వైసీపీ ఎమ్మెల్యేలు కరప్షన్ కింగ్ లు
రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటుంటే పులివెందులలో ఆయన సోదరుడు మదన్ మోహన్ రెడ్డి పిండేస్తున్నాడు. భూదందాలు, ఇసుక, మట్టి అక్రమ రవాణా, గ్రావెల్ దోపిడి ఇలా అన్ని దోపిడి చేస్తున్నారు. దళిత మహిళ నాగమ్మపై అత్యాచారం జరిగితే..కనీసం చర్యలు లేవు. పులివెందులలో ఈఏపీ కింద రూ. 300 కోట్లు, పీఎం.ఎస్.జీవై కింద రూ. 200 కోట్లు ఇస్తే కనీసం 20 శాతం కూడా పూర్తి కాలేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే…పేరుకే డాక్టర్ కానీ పెద్ద యాక్టర్…అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపులేదు. చికెన్ షాపుల నుంచి క్వారీలు, ప్రవేట్ పరిశ్రమలు అన్నీ కప్పం కట్టాలి. మైలవరం సోలార్ పార్క్ యజమానిని బెదిరించి కమీషన్లు తీసుకున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే బెట్టింగ్ ప్రసాద్, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

బీసీ నేత నందం సుబ్బయ్యను పొట్టన పెట్టుకున్నారు. కర్ణాటక నుంచి డీజీల్ తెచ్చి అక్రమంగా అమ్ముతున్నారు. కల్లూరు లింక్ కెనాల్ కి చెందిన 2.7 ఎకరాలు తన వెంచర్ లో కలుపుకున్నారు. అధికారులను బూతులు తిడుతున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే చింతగుంటలో 80 ఎకరాల భూమి కొల్ల గొట్టారు. ఎర్రబెల్లిలో అక్బర్ బాషా అనే భూమిని దొంగ పట్టాలతో తన పేరుతో మార్చుకున్నాడు. నంద్యాల పేటలో 104 ఎకరాలు ఆక్రమించారు. కుందూ నదిలో ఇసుక బొక్కేస్తున్నారు. కమలాపురం ఎమ్మెల్యే కరప్షన్ కింగ్ లేపాక్షికి చెందిన రూ. 20 వేల కోట్ల విలువైన 9 వేల ఎకరాలు కొట్టేందుకే ప్లాన్ చేస్తున్నారు.

కడప శివారులో రూ. 200 కోట్ల విలువైన 54 ఎకరాలు, సర్వా రాయుడు ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు, వక్స్ భూములు ఆక్రమించారు. బుగ్గవంగ వాగును ఆక్రమించి ధియేటర్ కట్టారు. బద్వేల్ అంతా బూబకాసురులే… రికార్టులు మార్చి రూ. 2 వేల కోట్ల విలువైన భూములు ఇస్టానుసారంగా కబ్జా చేశారు. ఎవరినీ వదలను దోచుకున్నదంతా కక్కిస్తా. వడ్డీతో సహా చెల్లిస్తా. కడప లో డిప్యూటీ సీఎం ఉత్సవ విగ్రహంలా మారారు. ముస్లింలకు ఒక్క రూపాయి సాయం చేశారా?

కడప జిల్లాకు హామీలు
పులివెందులో టీడీపీ హయాంలో మొదలు పెట్టిన పాపాకిని నదిపై బ్రిడ్జిని పూర్తి చేస్తాం, గండికోట రిజర్వాయర్ బాధితులకు, రాజోలు ఆనకట్ట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. ప్రొద్దుటూరులో కుందూ, పెన్నా వరద కాలువలు పూర్తి చేస్తాం.చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తాం. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగ కాలువ, కేసీ కెనాల్, నిప్పుల వాగు కాలువ సామర్ధ్యం పెంచుతాం. రాయలసీమకు సాగు, త్రాగు నీరు సమస్య పరిష్కారం చేసి రాయలసీమను రతనాల సీమగా మార్చుతానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE