Suryaa.co.in

Andhra Pradesh

కరవుపై జగన్-జవహర్‌రెడ్డి దారులెందుకు వేరు?

– రాష్ట్రంలో కరవు ఉందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి చెబుతారు… కరవు లేదని ముఖ్యమంత్రి చెబుతారు
– ప్రభుత్వ పాలనా తీరువల్ల రైతాంగం అల్లాడుతున్నారు
– రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎంలో చలనం లేదు
-అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో సీఎం
– 400 మండలాలు కరవుతో అల్లాడుతుంటే.. ఎందుకు ప్రకటించడం లేదు?
– రైతులకు నీరు ఇవ్వలేని జగన్.. తమ సొంత కంపెనీలకు జీవోలు ఇచ్చి మరీ నీరిస్తున్నారు
– 3.45 టీఎం సీలు ఇండో సోల్ కు జీవో ద్వారా మళ్లించేలా చేశారు
– మైలవరం నుంచి నీరు తెచ్చి మరీ భారతీ సీమెంట్స్ కు అందిస్తున్నారు
– మందుల షాపుకు వెళ్లి క్షవరం చేయమని అడగం కదా ?
– బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్

విజయవాడ…. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే రాష్ట్రప్రభుత్వం మోద్దు నిద్రపోతోంది. రాష్ట్రంలో కరవు విషయంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఒకటి మాట్లాడితే ముఖ్యమంత్రి మరొకటి మాట్లాడుతున్నారు వీరిద్దరికీ పొంతన లేకుండా వ్యవసాయ మంత్రి సమాధానాలు చెబుతున్నారు. ఏదశ లోను కూడా వీరిముగ్గురి మాట ఒకటి గా లేదు ఈ కారణంగా రైతాంగం భయాందోళనలోకి నెట్టవేయబడుతున్నారు. అందువల్ల రైతాంగానికి భారతీయ జనతా పార్టీ వెన్నుదన్నుగా నిలవ బోతోందని బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ స్సష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఎపీలో రైతులు, ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.జగన్ కు తన స్వార్ధం తప్ప.. ప్రజల పాట్లు అవసరం లేదు .రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. సీఎంలో చలనం లేదు.అధికారులు కూడా స్పందించకపోవడం దారుణం.ఎపీలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి రోమ్ నగరం తగలపడుతుంటే.. ఫిడేల్ వాయించిన చందంగా సీఎం తీరు ఉంది.30 లక్షల ఎకరాల్లో సాగు సాగడం లేదని, 20 లక్షల ఎకరాల్లో వరి సాగు నిలిపేశారని సీఎంకు తెలియదా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ముందస్తు ప్రణాళికలు లేవు, సమీక్షలు పట్టవు..రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం.. వారిని నట్టేట ముంచాడు.కరవు పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చెప్పడానికి సిగ్గుండాలి.అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో సీఎం ఉన్నారు.ఎక్కడ ఎవరితో సమీక్షలు చేశారో జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. నిజంగా అధికారులతో చేసిన సమీక్ష చేసి ఉంటే ఏమి నిర్ణయాలు తీసుకున్నారో బహిర్గతం చేయండి.సంబంధిత శాఖ మంత్రులు నోరు మెదపరు.. అసలు ఏం జరుగుతందో వారికి తెలియదు .వివిధ ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు చేయాల్సిన సమయంలో శుంకుస్థాపనలు చేస్తున్నారు.

రైతుల దీన స్థితి, ప్రాజెక్టుల పరిస్థితి పై పత్రికలలో ఆధారాలతో కథనాలు వస్తున్నా చలనం లేదు సీఎం సొంత జిల్లానే కరవుతో ఉన్నా… కనిపించకపోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి వస్తున్నా.. ముందస్తు చర్యలు లేవు ఇంత తీవ్రంగా కరవు ఉండే.. కరవు మండలాలు మూడేనంట ఇదేం దారుణం అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు మళ్లించి.. రైతులకు ఆపేశారు.

రైతాంగానికి ఇచ్చిన సబ్సీడీలను జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. పోలవరం కోసం ఇచ్చిన నిధులను తమ జేబుల్లో వేసుకుంటున్నారు. 400 మండలాలు కరవుతో అల్లాడుతుంటే.. ఎందుకు ప్రకటించడం లేదు. ఇందులో రాజకీయం ఎందుకు.. కరవు మండలాల ద్వారా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే బాధ్యత సీఎంకు లేదా .రైతులు పట్ల జగన్ కు ఎందుకు అంత పగ సాధిస్తున్నారో అర్దం కావడం లేదు .రైతులకు నీరు ఇవ్వలేని జగన్.. తమ సొంత కంపెనీలకు జీవోలు ఇచ్చి మరీ నీరిస్తున్నారు.ఇండో సోల్ కంపెనీ కోసం వేల ఎకరాలు కట్టబెట్టి.. ప్రభుత్వ శాఖల నుంచి ఉచిత సేవలు అందించేలా ఆదేశాలు ఇచ్చారు.3.45 టీఎం సీలు ఇండో సోల్ కు జీవో ద్వారా మళ్లించేలా చేశారు .

1.37 టీఎంసీల నీటిని అరబిందో. 0.98 టీఎెంసీలు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కు నీరు ఇచ్చారు .భారతి సిమెంట్స్ కు , ప్రతిభ బయోటెక్ కు ఇష్టానుసారంగా నీరు మళ్లించారు.రాయలసీమలో దుర్భిక్షంగా తీవ్రంగా ఉన్న చోట్ల జగన్ ఇచ్చిన జీవోలు ఇవి.రైతులకు తాగు నీరు లేదు.. సంస్థలకు మాత్రం నిరంతరాయంగా నీరు ఇవ్వడం దుర్మార్గం కాదా అన్నారు.

మైలవరం నుంచి నీరు తెచ్చి మరీ భారతీ సీమెంట్స్ కు అందిస్తున్నారు.కేవలం జగన్ సొంత కంపెనీలకు మాత్రమే నీరు ఇస్తున్నారు.. బయటి కంపెనీలకు మాత్రం చుక్క నీరు లేదు.ఎపీలో మీ సొంత కంపెనీలు బాగు పడాలి, ఆస్తులు పెంచుకోవాలి. రైతులు మాత్రం పంటలు పండక, అప్పులుతో ఆత్మహత్యలు చేసుకోవాలా.పునరుత్పాదక ఉత్పత్తి పేరుతో తన ప్రైవేటు కంపెనీలకు దారాదాత్తం చేశారు.రైతులు వలసపోయేలా చేసి, ఆ భూములను కూడా స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతుంది.ఈ విషయం పై బీజేపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తాం .కేంద్రం నుంచి ఒక బృందాన్ని తెప్పించి.. నష్టపరిహారం అంచనా వేసేలా ప్రయత్నిస్తాం.రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతుగా కరవు మండలాలు ప్రకటించాలి

రేపు ఒంగోలులో బీజేపీ పదాధికారులు సమావేశం.. రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది. కరవు పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ పై రాజకీయ తీర్మానం జరుగుతుంది. .ఎపీలో చాలా విచిత్ర పరిస్థితి ఉంది సీఎం కరవు లేదంటాడు.. సీయస్ కరవు తీవ్రంగా ఉందంటాడు.సీఎం సమీక్ష చేయకపోతే.. రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదు.అధికారులకు, పాలకులకు మధ్య సమన్వయం లేదని అర్దం అవుతుంది.రైతుల శ్రేయస్సును దృ,ష్టిలో ఉంచుకుని జగన్ తన తీరు మార్చుకోవాలి.అసలు ఎన్ని ప్రాజెక్టులు, ఎన్ని కాలువలకు నీరిచ్చారో శ్వేత పత్రం విడుదల చేయండి

మా అధ్యక్షురాలు మీ తప్పులను ప్రశ్నిస్తే.. వ్యక్తిగతంగా దూషిస్తారా?

మీకు దమ్ముంటే.. నేరుగా మేము అడిగిన వాటిపై స్పందించండి.అధికార పార్టీ గా మిమ్మలను ప్రశ్నిస్తున్నాం.. ఏం చేశారో చెప్పండి .మందుల షాపుకు వెళ్లి క్షవరం చేయమని అడగం కదా.రాష్ట్రంలో వ్యవసాయశాఖ మంత్రి ఎవరంటే చాలా మందికి తెలియదు.ఇరిగేషన్ శాఖ మంత్రి అంటే.. ఆయన వేరే విధంగా తెలుసని చెబుతున్నారు .కేంద్రం ఎపీకి అన్ని విధాలా సహకారం అందిస్తున్నా.. జగన్ ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది .ఏపీలో 80శాతం నష్టం జరుగుతుంటే.. పది శాతమే చూపిస్తున్నారు .మాకు సంస్కారం ఉంది.. వ్యక్తిగత దూషణలు మేము చేయము

వైసీపీ నేతలు సమస్యల నుంచి దృష్టి మరల్చడంలో సిద్దహస్తులు .మా అధ్యక్షురాలిపై చేసిన వ్యాఖ్యలకు మా నేతలు కౌంటర్ ఇచ్చారు..అయితే వారిలా బూతులు మాట్లాడలేము.. మీడియాకు కావాల్సిన విధంగా మేము నోరెసుకుని పడలేము .వారికి సభ్యత, సంస్కారం లేదు కాబట్టే.. నోరేసుకుని వాగుతారు .అసలు విషయం పై ఎఫ్పుడైనా వైసీపీ నేతలు స్పందించారా.. వారికి ఆ దైర్యం కూడా లేదు.

పాత్రికేయుల సమావేశంలో బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్,బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార స్వామి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE