– హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ
మీ యజమాని (బీజేపీ) వద్ద నుండి హుకుం జారీ అయితేనే మీరు నోరు విప్పుతారా అసద్ గారు?ఇన్ని రోజులు గుర్తుకు రాని ఆంధ్ర రాష్ట్ర ముస్లింలు ఇప్పుడు ఎందుకని గుర్తుకొచ్చారు? అబ్దుల్ సలాం హాజిరా ఇలాంటి అనేకమైనటువంటి అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు స్పందించని మీరు ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు?
రాష్ట్రంలో ముస్లింల సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయింది అయినా గాని మీరు ఇప్పటి వరకు ఎప్పుడు స్పందించలేదు కానీ ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు?ఎన్నికలు దగ్గర పడిన వేళ ఆంధ్ర రాష్ట్ర ముస్లింలను బుట్టలో వేసుకునే విఫల ప్రయత్నం చేయకండి.ఎవరిపై నమ్మకముంచాలి ఎవరిపై నమ్మకం ఉంచకూడదు రాష్ట్ర ముస్లింలు చూసుకుంటారు.
బీజేపీకి బీ టీమ్ అయిన మీరు జగన్ రెడ్డి చెప్పిన విధంగా మీరు స్పందించటం వల్ల మీరు ఇద్దరు బీజేపీ బీ టీమ్ ఆన్న సంగతి స్పష్టమౌతుంది. హైదరాబాద్ మహా నగరంగా తీర్చి దిద్దడంలో ఇద్దరు నవాబుల హస్తం ఉంది ఒకరు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అయితే ఇంకొకరు చంద్రబాబు