Suryaa.co.in

Andhra Pradesh

రెడ్ల దురహంకారంపై దళిత ఎమ్మెల్యేలు నోరు విప్పరేం?

నీళ్లు అడిగితే మూత్రం తాగిస్తారా?
కంచికచర్ల ఘటన వై మౌనంగా ఉన్న వైసీపీ దళిత ప్రజాప్రతినిధుల దళితద్రోహులే
దళిత బాధితుడపిని పరామర్శించిన బహుజన ఐకాస బాలకోటయ్య
‘జోడు పదవులు’ నోరు విప్పాలి
– కంచికచర్ల సంఘటనపై బహుజన ఐకాస బాలకోటయ్య

అభం శుభం తెలియని కంచికచర్లకు చెందిన కాండ్రు శ్యాం కుమార్ పై రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు చేసిన దాష్టీకం పట్ల నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ నోరు విప్పాలని, దోషులను అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కంచికచర్ల లోని శ్యాం కుమార్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. సంఘటన గూర్చి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రెండేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటనతో ఎలాంటి సంబంధం లేని శ్యాం ను రెండురోజుల క్రితం ఒంగోలు గణపవరం ప్రాంతానికి చెందిన హరిష్ రెడ్డి నేతృత్వంలో ఐదుగురు వ్యక్తులు వచ్ఛి నమ్మకంగా ఫోన్ చేసి పిలిపించుకుని కారులో తీసుకెళ్ళారని చెప్పారు. కళ్ళకు గంతలు కట్టి, కొడుతూ విజయవాడ, గుంటూరు మధ్య తిప్పారని తెలిపారు. దాహం వేస్తుంది అంటే ఆరుగురు కలిసి మూత్రం పోసినట్లు బాధితుడు చెప్పారని అన్నారు. తల్లి శేషమ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.

పోలీసులు హడావుడి చేయటం తప్ప చర్యలు తీసుకోవటంలో అలసత్వం కనిపిస్తుందన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ సంఘటనను రాజీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నందిగామ నియోజకవర్గంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా పని చేశారని, ఇలాంటి సంఘటన జరగలేదని తెలిపారు. సామాజిక న్యాయ యాత్ర చేస్తున్న నాయకులను ఇదేనా?

సామాజిక సాధికారత అంటూ నిగ్గదీశారు. ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉండగా న్యాయం జరగకపోతే మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. వెంటనే దోషులను అరెస్టు చేయాలని, బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని బాలకోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE