Suryaa.co.in

Political News

చంద్రబాబు అరెస్టు-విడుదలతో ఏం తెలిసింది?.. ఏమి జరిగింది?

చంద్రబాబుకు జైలు “ఫోబియా “పోయింది.
అంతర్మధనం,ఆత్మావలోకనం జరిగినది.
మిత్రులెవరో..శత్రువులెవరో తెలిసింది.
అక్కరకు రాని చుట్టాలెవరో స్పష్టమైంది.
ఇకపై రాజకీయాలు ఎలా చేయాలో బోధపడింది.
లోకేష్ కు బాధ్యత ఇచ్చింది.
సమర్థతను ప్రదర్శించే సంధర్భం వచ్చింది.
క్లిష్ట సమయంలో ఎలా మనుగడ సాధించాలో కుటుంబానికి తెలిసొచ్చింది.
భువనేశ్వరి,బ్రాహ్మణిల కు రాజకీయ పాఠాలు నేర్పింది.
బాబు చేసిన అభివృద్ధి గురించి జనం మాట్లాడుకునే అవకాశం దక్కింది.
శత్రువులను ఏకం చేసింది.
అపోహలు దూరం చేసింది.
నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపింది.
ఎన్నికలకు 6నెలల ముందే కార్యకర్తలను తట్టి లేపి.. మేలుకొలిపింది.
చంద్రబాబు ఘనత, కీర్తి,దేశ వ్యాప్తంగా వ్యాపించింది.
జరిగిన మేలు ఏమిటో యువతకు తెలిసింది.
వెటకారంగా మాట్లాడిన వాళ్ళకి హైదరాబాద్ అభివృద్ధి లో చంద్రబాబు పాత్ర ఏమిటో తెలిసింది.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కి కునుకు లేకుండా చేసింది.
తెలంగాణ లో కాగ్రెస్ కు కలిసొచ్చింది.
బిజెపి కి తత్వం బోధపడింది.
చంద్రబాబు విలువ ఏమిటో స్వయంప్రకటిత మేధావులకు సైతం తెలిసొచ్చింది.
జైలు నుండి బయటకొచ్చిన తరువాత ప్రజా స్పందనను ప్రత్యక్షంగా చూసే అవకాశం చంద్రబాబుకి దక్కింది.

– కృష్ణారావు

LEAVE A RESPONSE