జగన్ రెడ్డి చేస్తున్న కాపు ద్రోహంపై వైకాపా కాపు నేతలు ఎందుకు మాట్లాడరు?

– మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

జగన్ రెడ్డి రాష్ట్రానికి ఎదో న్యాయం చేస్తాడని అనుకోవటం ఎండమావిలో నీళ్లున్నట్లుగా భ్రమించడమే. వైకాపా నాయకులుతో పాటు ముఖ్యమంత్రే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే వైకాపా కాపు నాయకులు ఎందుకు ఖండించరు? కాపు సామాజికవర్గంపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేని వైకాపా కాపు నాయకులు జగన్ రెడ్డి ఆదేశాలతో పవన్ కళ్యాణ్‌పై మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతారా? రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కూటమి 170 సీట్లతో అఖండ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది.

వైసీపీ సింగల్ డిజిట్‌కే పరిమితం కాబోతోంది. జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు ఇంటికి సాగనొంపుదామా, జగనాసురుడి రాక్షస పాలనకు ఎప్పుడు అంతం పలుకుదామా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతీ వర్గం, ప్రతీ కులం, ప్రతీ మతం ప్రజలు జగన్ రెడ్డికి రాబోయే ఎన్నకల్లో వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తు రెండు పార్టీల కోసం కాదు.

ఈ కూటమి రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడం కోసం.. రాష్ట్రాభివృద్ధి సాధించడం కోసం.. నిరుద్యోగుల భవిష్యత్తు నిర్మించడం కోసం. తెలుగుదేశం-జనసేన తాటి పైకి వచ్చి ఎన్నకల్లో పోటీ చేస్తే వైకాపాకు ఉలుకెందుకు. 99 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడంతో వైకాపాకు నిద్రపట్టడం లేదు.

రాబోయే రోజుల్లో మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్ధులను ప్రకటిస్తాం. తెలుగుదేశం-జనసేన పొత్తుతోనే వైకాపా ఎప్పుడో కాడి వదిలేసింది. జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటున్నాడు. మేము వైనాట్ పులివెందుల అనే నినాదంతో ప్రజల వద్దకు రాబోతున్నామని తెలియజేస్తున్నాం.

 

Leave a Reply