-జగన్ సమాధానం చెప్పాలి
-ప్రజలు మళ్లీ ఎందుకు నమ్మాలి
-పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి
ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ప్రసంగించారు. ప్రత్యేక హోదా మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా తీసు కువస్తామని చెప్పారు. ఉద్యమాలు చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు రాదు అని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో మద్య నిషే ధం అని పెట్టి మీరే కల్తీ మద్యం అమ్మారు.
మూడు రాజధానులు అని ఒక్క రాజధాని లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. జలయజ్ఞంతో 42 పెండిరగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. 1.50 లక్షల కోట్లు అవసరం అన్నారు. పెండిరగ్ ప్రాజెక్టులలో ఒక్కటీ పూర్తి కాలేదు. రైతులకు 3 వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి అని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మీకు, మీ మాటకు విలువ లేదు. మీ మేనిఫెస్టోకు కూడా విలువ లేదని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్లీ మేనిఫెస్టో అంటే ఎవరు నమ్మరని హితవుపలికారు.
టెక్కలికి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు
టెక్కలి: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి బహిరంగ సభలో షర్మిలారెడ్డి ప్రసంగించారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ వైఎస్‌ఆర్ శంకుస్థాపన చేశాడు. 50 శాతం పనులు పూర్తి చేశాడు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది. జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఆఫ్ షోర్ పూర్తి చేసి 30 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తా అన్నారు. ఐదేళ్లలో తట్టెడు మట్టి తీయలేదు. వంశధార కాలువ ఆధునీకరణకు నిధులు ఇవ్వలేదు. టెక్కలికి ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చ లేదు.
ఇక్కడే కాదు..రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉందన్నారు. ఐదేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారు. కుంభకర్ణుడి లెక్క జగన్ ఇన్నాళ్లు నిద్రపోయాడు. ఇప్పుడు లేచి ఉద్యోగాలు అంటూ నోటిఫికేషన్లు ఇచ్చాడు. 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంట 7 వేలకు మాత్రమే ఇచ్చాడు. మాట తప్పం..మడమ తిప్పం అని చెప్పి మడమ తిప్పేశాదు. మద్యం అమ్మకాల్లో దోపిడీ జరుగుతుంది. ఎక్కడకు డబ్బుపోతుందో తెలియదు. టెక్కలి ఎమ్మెల్యేగా కిల్లి కృపారాణి ని, ఎంపీగా పెడాడ పరమేశ్వర్‌రావును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.