– మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
– అధికారంలో ఉండి పోటీ యాత్రలు చేస్తే ఎలా?
– మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఉంది. ప్రభుత్వ కుట్రను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న భావనతోనే మేడిగడ్డ వెళ్తున్నాం.తెలంగాణను ఎండబెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తోంది. అవినీతి జరిగిందని పదేపదే మాట్లాడుతున్నారు. జరిగిన ప్రతి పనిలోనూ అవినీతి అని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలుజేయాలని చూస్తున్నారు.
అతి పెద్ద అవినీతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా చెబుతారు? ఆయన విచారణ అధికారా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నారు… సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరుల స్థూపం లేకుండా చేస్తారా? మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం.
ఎన్ డీ ఎస్ ఏ పేరు మీద నీళ్ళు వదిలి మేడిగడ్డ కొట్టుకుపోవాలని, ఎల్లంపల్లిని ఎండపెట్టాలని చూస్తున్నారు. నీళ్ళు ఇవ్వాలని మేము అంటున్నాం, సముద్రంలోకి మీరు వృధాగా వదులుతున్నారు… ఎవరికి సెన్స్ లేదు? మేడిగడ్డ కూలిపోయేలా చేసే కుట్రకు ప్రభుత్వం మాట్లాడుతోంది.
కాంగ్రెస్ నేతలు ప్రజలకు నీళ్ళు ఇచ్చి సెన్స్, కాంగ్రెస్ అభివృద్ధి యాత్రలు చేయాలి కానీ… మాకు పోటీ యాత్రలు కాదు. రైతులను ఆదుకోవాలని కోరుతుంటే అధికారంలో ఉండి పోటీ యాత్రలు చేస్తే ఎలా? కాంగ్రెస్ నేతల డొల్లతనం అర్థం అవుతోంది
ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య :
పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ ఉపకారవేతనాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి నిధులు ఇవ్వడం లేదు వెంటనే విదేశీ ఉపకారవేతనాలకు నిధులు విడుదల చేయాలి.
.కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ : బీ ఆర్ ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం 1.5 శాతం ఎక్కువ ఓట్లతో అధికారం లోకి వచ్చింది. అధికార మదంతో వ్యవహరిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని చూపే ప్రయత్నం, కుట్ర తగదు. ప్రజలు తగిన బుద్ది చెబుతారు.