– నిజమైన హనుమాన్ భక్తుడివైతే నీ కొడుకును పోలీసులకు అప్పగించు
– సాయి భగీరథ్ రోజూ ఎక్కడ తిరుగుతడో బండి సంజయ్ ను అడగాలి
– బండి సంజయ్ నిజంగా హనుమాన్ భక్తుడేనా?
– అయితే ఆయన కానీ అతను కుమారుడు బండి సాయి భగీరథ్ ఏనాడైనా హనుమాన్ మాల ధరించాడా?
– హనుమాన్ చాలీసా ఎపుడైనా చదివాడా?
– హిందూ భక్తులందరూ పాదయాత్ర చేస్తుంటే బండి సంజయ్ కొడుకు ఎందుకు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు?
– హిందువుగా జీవిద్దాం.. తప్పు చేసిన హిందువును ప్రశ్నిద్దాం
– బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి కూడా. ఈ రోజు కరీంనగర్ లో హనుమాన్ జయంతి సందర్భంగా జరగనున్న ఏక్తా యాత్రకు హాజరయ్యే, హిందూ బంధువులందరికీ మనవి.
వందల కిలోమీటర్ల పాటు ఎండలను లెక్కచేయకుండా కుటుంబాలను వదిలేసి లోక కళ్యాణం కోసం, కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ బాగుండాలని కాలినడకన కొండగట్టుకు చేరుకుంటున్న నిజమైన, అసలైన హిందూ భక్తులందరూ బండి సంజయ్ కి కొన్ని ప్రశ్నలు వేయాలి.
బండి సంజయ్ నిజంగా హనుమాన్ భక్తుడేనా? అయితే ఆయన కానీ,అతను కుమారుడు బండి సాయి భగీరథ్ ఏనాడైనా హనుమాన్ మాల ధరించాడా? హనుమాన్ ఛాలీసా ఎపుడైనా చదివాడా? మనమంతా కాలినడకన భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తుంటే బండి సంజయ్ కొడుకు ఎందుకు బెంజ్ కార్లలో తిరుగుతున్నాడు?
ఆంజనేయ స్వామి సీతమ్మ కోసం లంకను తగలబెట్టి, సొంత తల్లి కాకపోయినా సీతమ్మనే తల్లిగా భావించి,జీవితాంతం దేవతగా ప్రార్థించారు. వివాహం చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగా గడిపి పరాయి స్త్రీ ని కన్నెత్తి కూడా చూడని ఆదర్శప్రాయుడు. కానీ సాయి భగీరథ్ మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేసి, ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు?
సోమవారం నుండి ఆదివారం వరకు ఏ దేవున్ని ప్రార్థిస్తామో చెప్పే బండి సంజయ్ ..
తన కుమారుడు సాయి భగీరథ్ సోమవారం నుండి ఆదివారం వరకు ఎవరిని కొడతాడు? ఎవరిపై అఘాయిత్యానికి పాల్పడతాడు? ఏ పబ్ లో ఉంటాడు? ఏ హుక్కా సెంటర్ లో గడుపుతాడో చెప్పండి. ఈ రోజు తడిబట్టలతో వచ్చి హనుమాన్ మందిరంలో,బాధిత అమ్మాయి తల్లిని బెదిరించింది నిజమా? కాదా? అని చెప్పమని అడుగాలి.
బండి సంజయ్ నిజమైన హనుమాన్ భక్తుడు అయితే,వెంటనే ఆయన కుమారుడిని తక్షణమే పోలీసులకు అప్పగించమని నిలదీయండి. హిందువుగా గర్విద్దాం.. హిందువుగా జీవిద్దాం.. తప్పు చేసిన హిందువును ప్రశ్నిద్దాం.