అమరావతి : అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత ప్రముఖమైన అస్సాం రాష్ట్రంలోని గువాహటి నగర సమీప నీలాచల్ పర్వతంపై వెలసిన శ్రీ కామాఖ్య దేవి అమ్మవారిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్ మోహన్ నాయుడు గారితో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దర్శనం అనంతరం ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత గురించి ఆలయ అర్చకులు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కొంతసేపు గడిపిన కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు భక్తులతో ఆప్యాయంగా ముచ్చటించారు.